హీరో-హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్ మెంట్ | Ranveer Singh Deepika Padukone secretly engaged

Ranveer singh deepika padukone secretly engaged

Ranveer Singh Deepika Padukone secret Engagement, Ranveer-Deepika Marriage, Ranveer-deepika break up, Ranveer not marriage with deepika

Ranveer Singh Deepika Padukone secretly engaged and decided to got marraige after 2 years.

టాప్ హీరో-హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్ మెంట్

Posted: 07/08/2016 03:49 PM IST
Ranveer singh deepika padukone secretly engaged

ప్రస్తుతం సినీ జంటలు కొంత కాలం డేటింగ్ పేరుతో అడ్డమైన తిరుగుళ్లు తిరిగి ఆపై తాపీగా బ్రేకప్ చెప్పుకుని విడిపోవటం షరా మాములే. ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త గ్యాప్ ఇచ్చి, మరోకరితో రిలేషన్ షిప్ లో ఉన్నానని హింట్ ఇచ్చి, చివరికి ఎవరో ఒకరితో ముడిపడిపోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓ కపుల్ మాత్రం తామూ ఖచ్ఛితంగా పెళ్లి పీటలు ఎక్కి తీరతామని ఎక్కడా చెప్పలేదు. అయినప్పటికీ ఆ పని చేసేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బాలీవుడ్ లో హాట్ కపుల్ గా పేరొందిన దీపిక పదుకునే, రణ్ వీర్ సింగ్ లు సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వదంతులు ఇప్పుడు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. ఓ ముంబై పత్రిక కథనం ప్రకారం కొద్ది నెలల క్రితమే వీరిద్దరు తల్లిదండ్రుల సమక్షంలో రింగులు మార్చేసుకున్నారంట. దీంతో వీళ్ల నిఖా పక్కా అని అందులో రాసింది. 31 ఏళ్ల రణ్ వీర్ సింగ్, 30 ఏళ్ల దీపికా ఎక్కడా తమ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోయినప్పటికీ తమ మధ్య ఉన్న ప్రేమను చాలా సందర్బాల్లోనే బహిరంగంగా వ్యక్తం చేసుకున్నారు. చివరకు పెద్దలను ఒప్పించి మ్యారేజ్ కి రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం హాలీవుడ్ లో దీపికా, బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ లు తెగ బిజీగా ఉన్నారు. మరో రెండేళ్ల పాటు వివాహ ప్రస్తావన అక్కర్లేదనే ఆలోచనలో ఈ యువ జంట ఉందట. అయితే తల్లిదండ్రుల ఒత్తిడితో ఈ సీక్రెట్ ఎంగేజ్ మెంట్ కానిచ్చేసి, ఎంజాయ్ చేసి చివరాఖరికి పెళ్లితో తమ రిలేషన్ షిప్ కి శుభం కార్డు వేద్దామని చూస్తున్నారంట.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranveer Singh  Deepika Padukone  Engagement  Wedding  2018  

Other Articles