maheshbabu doing many films in next coming 2 years

Maheshbabu doing many films in next coming 2 years

maheshbabu films, maheshbabu next projects, maheshbabu films, maheshbabu and puri, puri jagan movie, vamsi paidypalle, mahesh koratala, mahesh trivikram, mahesh upcoming movies

tollywood superstar prince maheshbabu doing many films in tamil and telugu, in this regarding he have 8 projects in hand coming two years

కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది...!

Posted: 07/08/2016 10:50 AM IST
Maheshbabu doing many films in next coming 2 years

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు మంచి జోరుమీదున్నాడు. సినిమాలు ఎంచుకోవడం డైరెక్టర్లని సెలెక్ట్ చేసుకోవడంలాంటి పనులు చక చక చేసేస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమాతో అభిమానుల్ని నిరాశపరిచినా కూడ తన తర్వాత సినిమా మురుగదాస్ తో అదిరిపోయే హిట్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈసారి కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది అని మహేష్ స్టైల్లో చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.

ఇటీవలే లండన్ టూర్ ఫినిష్ చేసుకుని వచ్చిన ప్రిన్స్ ఇప్పుడు తన సినిమాలన్నింటినీ లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ తో చేయబోయే సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో ఒక సినిమాని చేసేందుకు కమిట్ అయిపోయాడు. ఈసినిమాలో మహేష్ క్యారెక్టర్ ని డిఫరెంట్ గా డిజైన్ చేయబోతున్నాడు వంశీ పైడిపల్లి. ఇక తర్వాత గతంలో 24 సినిమా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ చెప్పిన కథను ఓకే చేసిన మహేష్ ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని సిద్ధం చేయమని డైరెక్టర్ కి చెప్పాడట. మరో విషయం ఏంటంటే, విక్రమ్ తో సినిమా, పూరీ జగన్ తో చేసే 'జనగణమన' సినిమాలు ఒకేసారి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇక తమిళనటి కుష్బూ భర్త సుందర్ సి అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్న ఒక మల్టీ స్టారర్ సినిమాకి కూడ మహేష్ డేట్స్ ఇచ్చేశాడట. ఈ సినిమాని తమిళ , తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మించబోతున్నాడు డైరెక్టర్ సుందర్ సి. ఇప్పుడు మహేష్ బాబు 2018 వరకూ ఖాళీ లేకుండా తన కెరియర్ ని ప్లాన్ చేసేశాడు.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివలు చెప్పిన కథలను విన్న మహేష్ వాటికి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అంతేకాదు ఇటీవలే మహేష్ బాబుని కలిసిన హనురాఘవపూడి కూడ ఒక మంచి కథను చెప్పాడట. దానికి కూడ మహేష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు మహేష్ బాబు చేతిలో దాదాపుగా 7నుంచి 8 సినిమాలు వరుసగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం మహేష్ బాబుని అడిగితే సినిమాలకు కొత్త కథలు వస్తున్నాయి. గతంలో ఇన్ని కథలు లేకే తక్కువ సినిమాలు చేశానని, ఇప్పుడు సంవత్సారానికి కనీసం రెండు మూడు సినిమాలు ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాడు. ఇది విన్న మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

- మూర్తి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prince mahesh  maheshbabu  maheshbabu plans  maheshbabu next movies  maheshbabu shooting  

Other Articles