allu arjun guest appreance in allu sirish movie

Allu arjun guest appreance in allu sirish movie

allu arjun guest role, mallu arjun in mollywood, mohanlal movie bunny, bunny in allu sirish movie, sreerashtu shubamasthu movie, lavanya tripathi next, allu sirish movie

allu arjun doing guest role in allu sirish movie sri rasthu shuba masthu. this movie directed by mallidi venu

తమ్ముడికి అన్న గిప్ట్

Posted: 07/08/2016 10:20 AM IST
Allu arjun guest appreance in allu sirish movie

అల్లు అర్జున్ కి అతిథి పాత్రలో నటించడం కొత్తేమీ కాదు. తన క్యారెక్టర్ కొంచెం సేపు ఉన్నా సరే అది బాగుంటే చేసేస్తాడు. గతంలో చిరంజీవి సినిమా శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో కనపడి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన బన్నీ,ఆ తర్వాత రామ్ చరణ్ ఎవడు సినిమాలో కూడ అతిథి పాత్రలో కనిపించి ఆ సినిమా రేంజ్ ని పెంచాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా బన్నీ స్పెషల్ అప్పీరియన్స్ గా శ్రీరస్తు-శుభమస్తు సినిమాలో నటిస్తున్నాడట. ఈ చిత్రంలో అల్లు శిరీష్ , లావణ్య త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు తన బ్రదర్ సినిమా రేంజ్ పెంచేందుకు ఒక కీలకమైన పాత్రలో కాసేపు కనిపించబోతున్నాడు మన స్టైలిష్ స్టార్.

అల్లు శిరీష్ రెండు సినిమాల్లో నటించినా కూడ ఇంతవరకూ సరైన గుర్తింపు రాలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ కాసేపు కనిపిస్తే ఆ సినిమా రేంజ్ పెరుగుతుందని చెప్తున్నారు అందరూ. మల్లిడి వేణు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని, తన తమ్ముడి కెరియర్ కి మంచి ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తర్వాత సినిమాకి కూడ బన్నీ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  allu sirish  lavanya tripathi  mohanlal  srirasthu shubamasthu movie  

Other Articles