karthi maniratnam movie frist look poster out

Karthi maniratnam movie frist look poster out

maniratnam movie, maniratnam and karthi movie, karhti movie, karthi movie next, karthi and athidi

hero karhti and director maniratnam movie katru veliyidyi frist look released officially. in this movie karthi acting as a pilot and doing first time with maniratnam movie

నా ఊపిరి నీవే చెలి...!!

Posted: 07/08/2016 11:35 AM IST
Karthi maniratnam movie frist look poster out

డిఫరెంట్ టేకింగ్ తో ఇప్పటికీ తనదైన స్టైల్లో చిత్రాలు నిర్మిస్తున్న దర్శకుడు మణిరత్నం. గతంలో తన దగ్గర పనిచేసిన శిష్యుడు , హీరో సూర్య తమ్ముడు మంచి రొమాంటిక్ అండ్ మాస్ హీరోగా ఎదిగాడు. దాంతో మణిరత్నం కార్తీతో ఒక సినిమా తీస్తున్నట్లుగా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అథితిరావ్ హైదరి నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తమిళంలో 'కాట్రు వెలియిదై' అంటే తెలుగులో ఊపిరి వెళ్లే దారి అని, గాలి వదిలే మార్గం అని అర్ధం వస్తుంది.

ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి రవివర్మ ఫోటో గ్రాఫీని అందిస్తున్నాడు. మద్రాస్ టాకీస్ పతాకం పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. తొలి షెడ్యూల్ ఊటీలో ఉంటుందని ఈ చిత్రం మొత్తం చక్కని ప్రేమకథలా మరో గీతాంజలి సినిమాని గుర్తుచేసేలా ఉంటుందని చెప్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో కార్తీ ఒక పైలట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. 'నా ఊపిరి నీవే చెలి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karthi  hero karthi  oopiri hero  maniratnam  a r rehman  athidhi actress  

Other Articles