trisha and direcor govi combination movie nayaki releasing soon

Trisha and director govi combination movie nayaki releasing soon

trisha hot, tirsha horror, trisha nayaki, trisha and balayya, trisha affaires, trisha exposing, trisha horror comedy, trisha comedy, trisha ghost

trisha and director govi movie nayaki releasing soon. it is completly horror comedy based movie. the unit planing this movie both languages telugu and tamil.

భయపెట్టే 'నాయకి' సెన్సార్...!

Posted: 06/24/2016 12:36 PM IST
Trisha and director govi combination movie nayaki releasing soon

స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన గోవీ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ 'నాయకి'. టీజర్, ఆడియోతో మంచి అంచనాలనే రేకెత్తించిన ఈ సినిమా గత రెండు నెలలుగా రిలీజ్ డేట్ విషయంలో స్పష్టంగా ఏ విషయమూ తేల్చుకోలేక, ఆ తర్వాత వార్తల్లో లేకుండా పోయింది. ఇక తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

సెన్సార్ బృందం తరపున సినిమాకు మంచి రిపోర్ట్ వచ్చిందని తెలుపుతూ, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు గోవీ ఈ సందర్భంగా చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిషతో పాటు గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేష్, మాధవి లత, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
హారర్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ నటిస్తుండటంతో ఇలాంటి సినిమాలకి మంచి డిమాండ్ వచ్చింది. రెండు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనుండటంతో సినిమా బిజినెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది చిత్రయూనిట్.

కొసమెరుపు ఏంటంటే, అమ్మడు ఈ సినిమాలో ఒక పాట కూడ పాడింది. ఈ సినిమా ఆడియోని నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha rama krishnan  trisha actress  trisha hot  director govi  trisha horror movie  

Other Articles