hero nani directed one shot for bahubali in locations

Hero nani directed one shot for bahubali in locations

bahubali conclusion, bahubali movie, bahubali part 2 shooting, bahubali next part, bahubali sets nani, bahubali nani direction, bahubali rajamouli, bahubali scenes, bahubali getup, bahubali nani

hero nani directed one shot for bahubali in location of ramoji film city. he is visited bahubali sets and one scene and one shot directed casually

బాహుబలికి నాని డైరెక్షన్...!

Posted: 06/23/2016 11:18 AM IST
Hero nani directed one shot for bahubali in locations

‘జెంటిల్‌మన్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్రని వేసుకున్నాడు. అయితే ఇప్పుడు నాని మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా బాహుబలి లాంటి సినిమాకే డైరెక్షన్ చేశాడంటే నమ్మశక్యంగా లేదా ? ఇది నిజం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి కన్ క్లూజన్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలసిందే. అదే ఫిలింసిటీ లో నాని డైరెక్టర్ విరించి వర్మ తీస్తున్న సినిమా షూటింగ్ కూడ జరుగుతోంది. ఈ షూటింగ్ గ్యాప్ లో సరదాగా బాహుబలి సెట్ కి వెళ్లిన నాని అక్కడ సన్నివేసాలు జరుగుతుండటంతో రాజమౌళి పక్కనే కూర్చుని సీన్స్ ని డిజైన్ చేసి, మెగా ఫోన్ పట్టి యాక్షన్ చెప్పాడట.

గతంలో మనోడు హీరోగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా ద గ్రేట్ బాపుగారి దగ్గర పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అనుభవంతోనే ప్రతిష్టాత్మకమైన బాహుబలి సినిమాకి యాక్షన్ చెప్పే ఛాన్స్ కొట్టేశాడు ఈ కుర్రహీరో. భవిష్యత్ లో మెగా ఫోన్ పడతారా అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశ్యమేమీ లేదని ఇటీవలే చెప్పిన నాని ఇప్పుడు ఈ పని చేయడంతో అందరూ ఫ్యూచర్ లో నాని సూపర్ డైరెక్టర్ అవుతుడని చెప్తున్నారు.

కొసమెరుపు ఏంటంటే నాని ఈ షూటింగ్ చేసే టైమ్ లో సెట్ లో రాజమౌళి లేడు నేను బాహుబలి డైరెక్టర్ ఇకనుంచి అని సరదాగా ట్వీట్ చేశాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈగ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.    

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero nani  bahubali movie  ss rajamouli  prabhas  rana  

Other Articles