bajarangi bhaijan director kabeerkhan doing film with hrithik roshan

Bajarangi bhaijan director kabeerkhan doing film with hrithik roshan

hrithik roshan next movies, hrithik bollywood, hrithik films, hrithik upcoming films, hrithik next movie kabir, director kabir khan, kabeer khan director

kabirkhan bajarangi bhaijan director is interested to do the film with bollywood glamours hero hrithik roshan. he is searching a good story for hrithik and this year this project will confirmed.

వీళ్లిద్దరికీ సినిమా సెట్ అవుతోందా..?

Posted: 06/20/2016 02:49 PM IST
Bajarangi bhaijan director kabeerkhan doing film with hrithik roshan

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'బజరంగీ భాయిజాన్' సినిమాతో డైరెక్టర్ కబీర్‌ ఖాన్‌ దశ తిరిగిపోయింది. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడిగా ఆయన పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఆ చిత్రం కబీర్‌కు జాతీయ పురస్కారాన్ని సైతం తెచ్చిపెట్టింది. కథ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చినప్పటికీ కబీర్ తెరకెక్కించిన విధానానికి మంత్ర ముగ్ధులు అయిపోయారు బాలీవుడ్ వాసులు.

ఇప్పుడు కబీర్‌ తదుపరి చిత్రాలపై బాలీవుడ్ లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా కబీర్‌ ఖాన్‌ ఓ చిత్రాన్ని రూపొందించనున్నారన్న వార్త ఆసక్తి రేపుతోంది. నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్న భారీ బడ్జెట్‌ చిత్రం కోసం కబీర్‌, హృతిక్‌ జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సాజిద్‌ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.

ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తారని అంటున్నారు. కబీర్‌ తాజాగా తన కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌తో 'ట్యూబ్‌లైట్' చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉండగా, హృతిక్‌ 'కాబిల్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక కబీర్‌, హృతిక్‌ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని బాలీవుడ్ లో టాక్.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles