jaggu bhai as a villan in kalyanram and purijagan movie

Jaggu bhai as a villan in kalyanram and purijagan movie

jagapathibabu villan, jaggu dada villan, jaggu bhai villan, jaggu bhai and kalyanram, jagapathibabu and purijagan, purijagan next movie, purijagan and kalyan ram, kalyan ram own banner, athidi arya

jagapathibabu as a jaggu dada in kalyanram and purijagan combination movie. his look totally different in puri film.

అన్నకి విలన్ గా జగ్గూదాదా..!

Posted: 06/20/2016 01:54 PM IST
Jaggu bhai as a villan in kalyanram and purijagan movie

కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌కి ఇప్పుడు జగపతి బాబు తోడయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత జగ్గు దాదా తో పనిచేయడం అద్భతంగా ఉందని దర్శకుడు పూరి సోషల్ మీడియా ద్వారా చెప్పకొచ్చారు. జగపతి హీరోగా నటించిన బాచి సినిమాకు పూరి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక విషయానికొస్తే హీరోగా రిటైర్ అయిన జగపతి బాబు విలన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.

తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలతోనూ బిజీగా ఉన్న జగపతి కళ్యాణ్ రామ్‌ సినిమా కోసం మరోమారు పూరితో జతకట్టారు. పూరి స్పీడ్ తెలిసిందే గనక జగపతి షెడ్యూల్‌కు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. అతిథి ఆర్యా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాతో అటు తమ్ముడికి విలన్ గా నటించాడు. ఇప్పుడు అన్నకి విలన్ గా నటిస్తున్నాడు జగ్గుభాయ్. పూరీ ముద్దుగా జగ్గూదాదా అని సంభోదించాడు.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles