allu arjun next movie with linguswamy direction

Allu arjun next movie with linguswamy direction

allu arjun next movie, allu arjun upcoming, allu arjun with linguswamy, allu arjun next, allu arjun upcoming, allu arjun and devisriprasad, bunny vs dsp , lagadapati sridhar

allu arjun next movie with linguswamy direction confirmed. in this movie devisriprasad again music by allu arjun.

లింగుస్వామితోనే సినిమా ఫిక్స్....!

Posted: 06/18/2016 12:25 PM IST
Allu arjun next movie with linguswamy direction

'సరైనోడు’ సినిమాతో హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత సినిమా లింగుస్వామి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం బన్నీ తన లుక్‌ను మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించేందుకు లింగుస్వామి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. ఆర్టిస్టుల ఎంపిక విషయంలో, సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్టేజియస్ ప్రొజెక్ట్స్ లో ఎంతో బిజీగా ఉన్న డియస్ పి బన్నీ సినిమా అనేసరికి కాదనలేక ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమా , జూనియర్ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ ఇలా పెద్ద సినిమాలతో దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకే ముందుగానే బన్నీ కోసం దేవిశ్రీ ప్రసాద్ డేట్స్ బ్లాక్ చేశాడట లింగుస్వామి. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ఒక క్యారెక్టర్ కంప్లీట్ గా నెగిటివ్ గా ఉంటుందని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  bunny  devi sri prasad  bunny next movie  dsp  linguswamy  

Other Articles