hero srikanth back again in villan role for his career

Hero srikanth back again in villan role for his career

srikanth hero, srikanth in tollywood, srikanth next movies, srikanth upcomin, srikanth villan, srikanth villan role, srikanth upcoming movies, jaggu bahi, jagapathibabu villan.

hero sirkanth doing villan role in tamil movie. now he decided to act any kind of role villan, charechtor artist in any language.

జగ్గుభాయ్ బాటలో...

Posted: 06/18/2016 12:20 PM IST
Hero srikanth back again in villan role for his career

హీరో శ్రీకాంత్ సినిమాలకు ఒకప్పుడు మంచి మార్కెట్ ఉండేది. విలన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన అతికొద్ది స్టార్స్ లో శ్రీకాంత్ ఒకడు. సరైనోడు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మంచి మార్కులు కొట్టేశాడు. అంతకుముందు రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమాలో కూడ మంచి క్యారెక్టర్ ని ప్లే చేసి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, యంగ్ ఫాదర్ రోల్స్, బాబాయ్ , మావయ్య రోల్స్, విలన్ రోల్స్ ఖాళీగా ఉండటంతో సీనియర్ నటులకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గమనించిన హీరో శ్రీకాంత్ అటువైపుగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్న జగపతిబాబు ని ఆదర్శంగా తీసుకుని అలాంటి క్యారెక్టర్స్ వేసేందుకు శ్రీకాంత్ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళం,మలయాళం, తెలుగు భాషల్లో సినిమాల్లో విలన్లను బాలీవుడ్ నుంచి తెప్పించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు ఈ సీనియర్ హీరోలు.

అందుకే ప్రస్తుతం ఒక  తమిళ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడట శ్రీకాంత్. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. జగ్గుభాయ్ ఇప్పటికే విలన్ గా , ఫాదర్ రోల్స్ లో చేస్తూ బిజీగా అయిపోవడంతో ఇప్పుడు శ్రీకాంత్ కూడ అదే బాటలోకి రావడం దర్శక నిర్మాతలకు కొత్త ఊపునిస్తోంది.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srikanth  hero srikanth villan  srikanth villan role  jaggu bhai  

Other Articles