bollywood actress aliabhatt interview

Bollywood actress aliabhatt interview

aliabhatt, aliabhatt personal interview, aliabhatt next, aliabhatt movies, aliabhatt upcoming, aliabhatt next movies

bollywood actress aliabhatt saying she in no 1 in bollywood. in the career of her life she is touch the no 1 place in bollywood.

ఎప్పటికైనా ఆప్లేస్ నాదే..!

Posted: 06/17/2016 05:37 PM IST
Bollywood actress aliabhatt interview

బాలీవుడ్‌ హీరోయిన్స్ లో ఆలియాభట్‌కి మంచి క్రేజ్‌ ఉంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన ఈ సెక్సీ బ్యూటీ రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ యూత్ ను అలరిస్తోంది. అయితే తాను ఇంకా టాప్‌ పొజిషన్‌కి చేరుకోలేదని, దానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతోంది. ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తానని, ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నానని అనుకోవడం లేదు. ఆ స్థాయిని చేరుకునేందుకు కష్టపడుతున్నా. ఇంకా కష్టపడుతూనే ఉంటా. కచ్చితంగా ఏదో ఒకరోజు అగ్రస్థానానికి చేరుకుంటా. వయసులో చిన్నదాన్నే కాబట్టి నాకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకునేందుకు చాలా సమయం ఉంది అని చెప్పుకొచ్చింది ఆలియాభట్‌.

ఆలియాభట్‌ నటించిన ‘ఉడ్తా పంజాబ్‌’ రిలీజై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘బద్రీనాథ్‌ కీ దుల్హానియా’లో నటిస్తోంది. తరువాత గౌరీ షిండే దర్శకత్వంలో తొలిసారి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో జోడీ కట్టనుంది. అలాగే ‘ఆషికీ-3’ చిత్రానికి కూడా ఈమెనే ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఆలియా దూకుడు చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్‌ అనుకున్న ప్లేస్ కి వెళ్లేలాగానే కనిపిస్తోంది.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aliabhatt interview  aliabhatt bollywood  aliabhatt  aliabhatt movies  

Other Articles