పికె లాంటి భారీ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ప్రస్తుతం 'దంగల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్లో బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో అదే జానర్లో ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మామూలు కథల విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆమిర్, నిజజీవిత కథ కావటంతో దంగల్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్న ఆమిర్., ఆ లుక్స్ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే వయసయిన రెజ్లర్‌లా కనిపించటం కోసం 22 రెండు కేజీల బరువు పెరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సన్నివేశాల్లో ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపించనున్నాడు ఆమిర్. ఇక యంగ్ ఏజ్‌లో ఉన్న మహావీర్ పొగట్టకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం తనను తాను ఓ యోధుడిగా మలుచుకుంటున్నాడు. షూటింగ్ కు రెండు రోజుల ముందు తను ఎలా ఉన్నాడో చూపిస్తూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆమిర్. కేవలం 25 వారాల్లో 25 కిలోల బరువు తగ్గి కండల తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. సినిమా కోసం ఇంత రిస్క్ చేస్తున్న ఆమిర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమీర్ తుసీ గ్రేట్ హో అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more