malayalam mohanlal own dubbing in telugu language

Malayalam mohanlal own dubbing in telugu language

mohanlal, malayalam superstar, mohanlal in telugu, mohanlal in janahta garge, mohanlal vs chandrashekar, director yeleti vs mohanlal, mohanlal dubbing, mohanlal next, mohanlal tollywood

mohanlal malayalam superstar dubbing in telugu his own for upcoming movies. he acted two movies in this year in tollywood. one jr ntr movie and another one chandrashekar yeleti movie

సెట్ లో అందరూ ఖంగుతిన్నారు...!

Posted: 06/14/2016 12:31 PM IST
Malayalam mohanlal own dubbing in telugu language

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రస్తుతం ఓ రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారేజ్’ కాగా మరోటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తోన్న ‘మనమంతా’. ‘జనతా గ్యారేజ్‌’లో మెకానిక్‌గా నటించిన మోహన్‌లాల్ ‘మనమంతా’లో సూపర్ మార్కెట్ మేనేజర్‌గా మామూలు మధ్యతరగతి మనిషిగా కనపడనున్నారు.

‘జనతా గ్యారేజ్‌’లో మాత్రం ఆయన పాత్రని చాలా పవర్‌ఫుల్‌గా తీర్చి దిద్దారట డైరెక్టర్ కొరటాల శివ. దీంతో మోహన్ లాల్ తన క్యారెక్టర్ కి తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైపోయారట.
 తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి మాత్రమే కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేస్తున్న మనమంతా సినిమాకి కూడ సొంతంగా డబ్బింగ్ చెప్తున్నాడట ఈ మలయాళం సూపర్ స్టార్.   అంతేకాకుండా సెట్లోనూ ఆయన స్పష్టంగా డైలాగులు చెప్పడం చూసి యూనిట్ సభ్యులు ఖంగుతిన్నారట. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారని చెప్తున్నారు. అయితే, సెట్ లో అందరూ ఆయన్ని మలయాళం మామ అని పిలుస్తున్నారట.

జనతాగ్యారేజ్ సినిమా కంటే ముందే మనమంతా సినిమా విడుదలవుతుందని, దీనివల్ల మోహన్ లాల్ గొంతు జనాలకి పరిచయం అవుతుందని, దీంతో జనతాగ్యారేజ్ లో ఆయన గొంతు ప్రేక్షకులకు అలవాటు అయిపోతుందని చెప్తున్నారు అందరూ.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohanlal  jr ntr  jantha garage  mohanlal tollywood  mohanlal dubbing  

Other Articles