bahubali in china highest screens in record

Bahubali in china highest screens in record

rajamouli bahubali, rajamouli next, rajamouli upcomin, rajamouli upcoming movie, rajamouli china, rajamouli in china theatres, bahubali in china, bahubali collections, bahubali releasing china

bahubali in theatres in china higest screens in record in tollywood. this is frist indian movie releasing 6500 theatres in china. this is all time record in indian film industry said rajamouli.

చైనాలో బాహుబలి రికార్డ్

Posted: 06/14/2016 11:32 AM IST
Bahubali in china highest screens in record

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి - ది బిగినింగ్‌’ త్వరలో చైనా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. భారతదేశం కన్నా ఎక్కువ థియేటర్లలో భారీ స్థాయిలో ‘బాహుబలి’ని విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపారు. దిల్లీలో ఓ వార్తా సంస్థతో రాజమౌళి మాట్లాడుతూ ‘‘చైనాలో 6500 తెరల్లో ‘బాహుబలి’సినిమాని విడుదల చేయబోతున్నాం ఇది తెలుగు సినిమాలోనే అరుదైన రికార్డ్ అని అన్నారు. ఇది భారతదేశం కన్నా చాలా ఎక్కువ. ఈ నెలలోనో లేదా వచ్చే నెలలోనో అక్కడ ‘బాహుబలి’ విడుదలవుతుందని'' చెప్పారు.

‘బాహుబలి-ది కంక్లూజన్‌’ గురించి చెబుతూ ‘ప్రస్తుతం బాహుబలి- ది కంక్లూజన్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. మొదటి భాగం విడుదలైన మూడు, నాలుగు నెలల్లో రెండో భాగాన్ని విడుదల చేయాలనుకున్నాం.

అయితే కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర ఆలస్యమవుతోంది. రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ విషయంలో నాకు ఒత్తిడి లేదు. నిజానికి వారి అంచనాలే ఒత్తిడిని దూరం చేస్తున్నాయి. ఇంత విరామం తర్వాత వస్తున్నా రెండో భాగం తప్పక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకముందని’ అన్నారు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles