trivikram srinivas proved once again great director

Trivikram srinivas proved once again great director

A Aa movie, A Aa movie full, nithin, nithin samantha, trivikram talent, trivikram punch, trivikram comedy, trivikram market, rajamouli market, rajamouli vs trivikram

director trivikram srinivas proved onceagain great director in tollywood. A Aa movie is collecting more gross in overseas also. the film now in 50cr club. this is the highest in nithin career.

మిగతాదంతా సేమ్ టు సేమ్..!

Posted: 06/14/2016 10:42 AM IST
Trivikram srinivas proved once again great director

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ ఎప్పుడూ మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంటాయి. బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లను రాబడతాయి. అయితే, ఒక్కోసారి చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన రికార్డ్స్ ని సొంతం చేసుకుంటే మాత్రం అది రికార్డ్స్ లో పదిలంగా ఉండిపోతుంది. ఇప్పుడు అ-ఆ సినిమా సేమ్ అదే క్రియేట్ చేసి అందరికీ మరోసారి నిరూపించింది. ఏ హీరోని కానీ దర్శకుడిని కానీ తేలిగ్గా చూడకూడదు.  
తక్కువగా చూస్తే.. తేడాలొచ్చేస్తాయని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్‌ అయ్యింది.

పవన్‌ కల్యాణ్‌, అల్లుఅర్జున్‌, మహేష్‌ బాబు వంటి స్టార్లతోనే సినిమాలు తీసి హిట్లు కొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఎవరూ ఊహించనివిధంగా చిన్నహీరో నితిన్ తో అ..ఆ సినిమా తీస్తుంటే అందరూ రకరకాలుగా అనుకున్నారు. నితిన్‌ కూడా పూరితో సినిమాకు రెడీ అయ్యి చివరి నిమిషంలో దాన్ని వదులుకొని మాటల మాంత్రికుడి సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఈ కాంబినేషన్‌ ని ఫిలింనగర్‌ లో తేలిగ్గా తీసుకున్నారు. ఆ అవకాశాన్నే తమకు అనుకూలంగా మార్చుకున్నారు వీళ్లిద్దరూ.

భారీ అంచనాలు లేకుండానే ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్లతో పాటు మ్యూజిక్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ తెచ్చిపెడటంతో ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల కలెక్షన్లకు ధీటుగా అన్ని ఏరియాల్లో చివరకు ఓవర్సీస్‌ లో కూడా మంచి వసూళ్లు అందుకొని రూ.50 కోట్లక్లబ్‌ లో చేరింది. ఇప్పుడు మరోసారి సినిమాకి డైరెక్టరే ప్రాణం అని నిరూపించింది. గతంలో చిన్న సినిమాగా విడుదలయిన సునీల్ సినిమా మర్యాదరామన్న కూడ ఇలాగే బాక్సాఫీసు దగ్గర రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అప్పుడు దాని దర్శకుడు రాజమౌళి అయితే, ఇప్పుడు దీని దర్శకుడు త్రివిక్రమ్ అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trivikram srinivas  A Aa movie  hero nithin  nithin next  samantha  

Other Articles