భారీ రేటుకు జనతా గ్యారేజ్? | Janatha Garage nizam rights sold out

Janatha garage nizam rights sold out

Janatha Garage nizam rights sold out, Janatha Garage latest updates, Janatha Garage movie news, Janatha Garage stills, Janatha Garage teaser date, Janatha Garage posters, Janatha Garage malayalam, NTR, NTR awards, NTR best actor award, Temper, Cinemaa awards

Janatha Garage nizam rights sold out: Young tiger ntr upcoming film Janatha garage. koratala siva director.

భారీ రేటుకు జనతా గ్యారేజ్..!

Posted: 06/13/2016 04:24 PM IST
Janatha garage nizam rights sold out

‘నాన్నకు ప్రేమతో’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు బాగా వున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వస్తుండటంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ తెగ ఆరటపడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ ను దాదాపు 15కోట్లకు ప్రముఖ సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రేట్ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మలయాళంలో కూడా ఇదే పరిస్థితి. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రంజాన్ కానుకగా విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Samantha  Nithya menon  

Other Articles

Today on Telugu Wishesh