అందరి మనసు దోచుకున్న యంగ్ టైగర్ | NTR Speech in Cine Maa Awards 2016

Ntr speech in cine maa awards 2016

NTR in Cine Maa Awards 2016, NTR speech, NTR best actor award, NTR award for temper, NTR speech in cinemaa awards, NTR cine maa awards, NTR vs Chiranjeevi, NTR vs bunny, NTR movies, NTR movie updates, NTR stills

NTR in Cine Maa Awards 2016: Young tiger Ntr gets best actor award for temper in Cine Maa Awards 2016.

అందరి మనసు దోచుకున్న యంగ్ టైగర్

Posted: 06/13/2016 10:56 AM IST
Ntr speech in cine maa awards 2016

ప్రతి ఏటా సిని‘మా’ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతుందనే విషయం తెలిసిందే. ఆ ఏడాది నిలిచిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతికనిపుణులకు అవార్డులను ప్రధానం చేస్తూ వుంటుంది. అవార్డులతో పాటు సరదా సరదాగా సాగిపోయే తారల డాన్సులు, ఎంటర్ టైన్మెంట్ తప్పనిసరి. అయితే ఈసారి సిని‘మా’ అవార్డుల వేడుకలో చాలా ప్రత్యేకతలు జరిగాయి. అవెంటో ఒకసారి చూద్దామా!

- మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అందువల్ల మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్ ట్రీట్ ను ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు.

- ఇక గతకొద్ది కాలంగా మెగా, నందమూరి ఫ్యామిలీకి మధ్య కాస్త కోల్డ్ వార్ జరుగుతున్నాయంటూ వార్తలొస్తున్నాయి. నిజానికి వారి మధ్యలో ఎలాంటి కోల్డ్ వార్ లేకపోయినప్పటికీ.. అభిమానులు అలా భావిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఈ సినిమా అవార్డుల వేడుకలో ఆ పుకార్లన్నీ కూడా పటాపంచలయ్యాయి.

- 2008లో జరిగిన సిని మా అవార్డుల వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘యమదొంగ’ చిత్రానికి ఉత్తమ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డును సొంతం చేసుకున్నాడు. కానీ ఆ అవార్డును చనిపోయిన నటుడు శోభన్ బాబు కుటుంబానికి అంకితమిస్తున్నానని, అందువల్ల ఈ అవార్డును వారి కుటుంబానికి అందజేయవలసిందిగా చిరంజీవిని కోరుతున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించి, ఆ అవార్డును తిరిగిచ్చేసాడు.

Click Here for NTR Speech in Cine Maa Awards 2016

- దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఎలాంటి ఫంక్షన్లో కనిపించలేదు. తాజాగా 2016లో సినిమా అవార్డుల వేడుకలో మళ్లీ వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. 2015వ సంవత్సరానికి గాను ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా చిరంజీవి మరియు నాగార్జున చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.

- కానీ ఈసారి మాత్రం అవార్డును స్వీకరిస్తూ.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ వంటి తారలే మాకు స్పూర్తి. వీరి ఆశీర్వచనాలు ఎప్పుడు మా జెనరేషన్ తారలపై వుండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడున్న వారందిరి మొహల్లో చిరునవ్వులు విరజిల్లాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తన తోటి అగ్ర హీరోలను గౌరవించడం అటు నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం గర్వంగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఈ అవార్డుల కార్యక్రమంలో చాలా విశేషాలు జరిగాయి. త్వరలోనే ఈ వీడియోను మాటివి ప్రసారం చేయనుంది.

- ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ డాన్స్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఎప్పుడు పోటీపడుతూనే వుంటారు. కానీ వీరిద్దరూ 2008లో జరిగిన సిని మా అవార్డుల ఫంక్షన్లో కనిపించారంటే.. మళ్లీ తాజాగా 2016లో జరిగిన ఈ సినిమా అవార్డుల కార్యక్రమంలోనే కనిపించారు. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి, ఫోటోలకు ఫోజులివ్వడమే కాకుండా ఒకరిపై ఒకరు మంచి కామెంట్లు చేసుకుంటూ అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా చేసారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Cine Maa Awards 2016  Chiranjeevi  Allu Arjun  

Other Articles