నిరాశపరిచిన మెగాస్టార్ స్పెషల్ డాన్స్ | Megastar Chiranjeevi Dance Video

Megastar chiranjeevi dance video

Megastar Chiranjeevi Dance Video, Chiranjeevi Dance in Cinemaa awards 2016, Chiranjeevi in Cine Maa Awards 2016, Cine Maa Awards 2016, Chiranjeevi Dance, Chiranjeevi is Back, Chiranjeevi movies

Megastar Chiranjeevi Dance Video: Tollywood megastar chiranjeevi special dance in Cine Maa Awards 2016 program.

నిరాశపరిచిన మెగాస్టార్ స్పెషల్ డాన్స్

Posted: 06/13/2016 09:53 AM IST
Megastar chiranjeevi dance video

మెగాస్టార్ 150వ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆ 150వ సినిమాలో చిరంజీవి మరోసారి తన డాన్సులతో అదరగొట్టనున్నాడంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తూనే వున్నాయి. రాంచరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో చిరంజీవి అదిరిపోయే స్టెప్పులేయనున్నాడని వార్తలొచ్చాయి కానీ.. అందులో క్లైమాక్స్ సీన్లో వచ్చి, తన యాక్షన్ తో అదరగొట్టేసాడు.

ఇక 150 సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతున్న సంధర్భంలో సిని‘మా’ అవార్డుల కార్యక్రమంలో మెగాస్టార్ స్పెషల్ డాన్స్ చేసి, ప్రేక్షకులను అలరించబోతున్నారంటూ వారం రోజులు నుంచి వార్తలు జోరందుకున్నాయి. ఈ కార్యక్రమం కోసం మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టెప్పులు వేయనున్నాడని.. ప్రభుదేవా కొరియోగ్రఫి చేయబోతున్నాడని వార్తలొచ్చాయి. కానీ మొత్తానికి ఈ కార్యక్రమం ఇటీవలే పూర్తయ్యింది.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తుంటే సొంత డబ్బు ఎక్కువై.. డాన్స్ తక్కువైనట్లుగా అనిపిస్తుంది. చిరంజీవి డాన్స్ చేయకుండ తన 150వ సినిమా కోసం ఓ ప్రోమో వీడియోను ప్రజెంట్ చేసి, చివర్లో రెండు స్టెప్పులు వేసాడు. నిజానికి ఈ వేదికపై చిరు వేసిన స్టెప్పుల కంటే శ్రీజ సంగీత్ ఫంక్షన్లో చిరు వేసిన స్టెప్పులు బ్లాక్ బస్టర్ హిట్ గా చెప్పుకోవచ్చు.

Click Here for Megastar Chiranjeevi Dance Video

నిజానికి ఈ అవార్డు కార్యక్రమంలో చిరు డాన్స్ చూసి, మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. ఎందుకంటే మళ్లీ తమ అభిమాన హీరో 150వ సినిమా కోసం అదిరిపోయే డాన్సులు వేయడానికి సిద్ధమయ్యాడనే ఆనందంలో వున్నారు. శ్రీకాంత్, సాయిధరమ్ తేజ, సునీల్, నవదీప్ లతో పాటు పలువురు డాన్సర్లతో చిరు అదిరిపోయే రేంజులో డాన్స్ చేయాలనుకున్నప్పటికీ.. ఆ ప్రయత్నం అంత స్థాయిలో గ్రాండ్ సక్సెస్ కాలేదు.

చిరంజీవి డాన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాడో.. ఎప్పుడు ముగించాడో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది అభిమానులకు. కానీ ఈ అవార్డు కార్యక్రమంలో కూడా మెగాస్టార్ ఫుల్ లెంత్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వుంటే ఓ రేంజులో వుండేది. మొత్తానికి ఆశపెట్టి చిరంజీవి ఉసూరుమనిపంచేసాడు. కనీసం 150వ సినిమాలోనైనా దిమ్మతిరిగిపోయే రేంజులో మెగాస్టార్ మరోసారి తన డాన్సులతో దుమ్ముధులిపేసి, ప్రేక్షకులకు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇస్తాడని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Cine Maa Awards 2016  Kaththilantodu  

Other Articles

Today on Telugu Wishesh