బాహుబలి తరహాలో దండుపాళ్యం2 | Dandupalyam 2 compare with baahubali

Dandupalyam 2 compare with baahubali

Dandupalyam 2 shooting completed, Dandupalyam 2 movie stills, Dandupalyam 2 posters, Dandupalyam 2 movie updates, Dandupalyam 2 release date, Dandupalyam 2

Dandupalyam 2 compare with baahubali: Dandupalyam 2 movie shooting completed. Actress Sanjana acts an important role in this film.

బాహుబలి తరహాలో దండుపాళ్యం2

Posted: 06/11/2016 09:22 AM IST
Dandupalyam 2 compare with baahubali

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. 'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది.

తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి బిజినెస్‌ పరంగా చాలా పెద్ద క్రేజ్‌ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత వెంకట్‌ సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి2', 'రోబో2' వంటి సీక్వెల్స్‌ రూపొందుతున్న టైమ్‌లోనే 'దండుపాళ్యం2' నిర్మించడం ఆనందంగా వుంది

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ.... తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రానికి సినిమా ప్రారంభం నుంచే చాలా మంచి క్రేజ్‌ వస్తోంది. బిజినెస్‌ పరంగా చాలా పెద్ద ఆఫర్స్‌ వస్తున్నాయి. బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకి చాలా పెద్ద హైలైట్‌గా నిలుస్తాయి. ఇండియాలోనే భారీ బడ్జెట్‌ చిత్రాలుగా 'బాహుబలి2', 'రోబో2' వంటి సీక్వెల్స్‌ రూపొందుతున్న సమయంలోనే మా 'దండుపాళ్యం2' నిర్మాణం జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. 'దండుపాళ్యం' కంటే పెద్ద హిట్‌ అయ్యే రేంజ్‌లో డైరెక్టర్‌ శ్రీనివాసరాజు 'దండుపాళ్యం2' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. డెఫినెట్‌గా 'దండుపాళ్యం' కంటే 'దండుపాళ్యం2' పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది అన్నారు.

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.... రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో, కన్నడలో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది. 'దండుపాళ్యం'లాగే ఈ చిత్రం కథ, కథనాలు కూడా చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది అన్నారు.

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dandupalyam 2  Sanjana  Pooja Gandhi  

Other Articles

Today on Telugu Wishesh