అభిమానులకు మాటిచ్చిన నిహారిక | Niharika promise to mega fans

Niharika promise to mega fans

Niharika promise to mega fans, Niharika meet mega fans, Niharika interviews, Niharika latest stills, Niharika with mega fans, Niharika latest updates, Niharika oka manasu release dates, Niharika movies

Niharika promise to mega fans: Actor Nagababu`s daughter niharika introducing as a heroine with the film Oka Manasu. Ramaraju director.

అభిమానులకు మాటిచ్చిన నిహారిక

Posted: 06/11/2016 09:55 AM IST
Niharika promise to mega fans

ఇప్పటివరకు యాంకర్ గా, యూట్యూబ్ వెబ్ సిరీస్ నటిగా తానేంటో నిరూపించుకున్న నిహారిక ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామ‌రాజు ద‌ర్శక‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న ‘ఒక మ‌న‌సు’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 24 విడుదల కానుంది.

అయితే మొద‌టిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న న‌టిగా ఫ్యాన్స్ కు ఉన్న అపోహ‌లు, అనుమానాలు తొలగించ‌డానికి తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వివిధ జిల్లాల నుంచి 200 కు పైగా వ‌చ్చిన మ‌హిళా అభిమానుల‌తో నిహారిక ముచ్చటించి, వాళ్లు అడిగిన ప్రశ్నల‌కు జ‌వాబులిచ్చింది.

ఈ సంధర్భంగా నిహారిక మాట్లాడుతూ నా నుంచి వ‌చ్చే ఏ సినిమా వ‌ల్ల అయినా అభిమానుల‌కు గానీ, మా ఫ్యామిలీ కి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మెగా వార‌సుల‌ను ఆశీర్వదించిన‌ట్టుగా నన్ను కూడా ఆద‌రిస్తార‌ని న‌మ్మకంతో ఉన్నాను. ‘ఒక మ‌న‌సు’ గురించి చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ త‌మ‌ను తాము చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది. నా మొద‌టి చిత్రంకు ఇలాంటి సబ్జెక్ట్ దొర‌క‌డం నిజంగా నా అదృష్టం. ఈ చిత్రం త‌ర్వాత ఖ‌చ్చితంగా ఆడ‌పిల్లల్లో ప్రేమ విష‌యంలో మార్పు వ‌స్తుంది. ఫ్యామిలీ అంతా వెళ్లి చూసేలా ఒక మ‌న‌సు ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. నాగ‌శౌర్యతో చేయ‌డం చాలా హ్యాపీ. ఇప్పటికే పాట‌ల‌ను కొన్ని ల‌క్షల మంది విన్నారు. నిజంగా అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు సునీల్ క‌శ్యప్. నా కోసం ఇంత దూరం వ‌చ్చిన మా మెగా అభిమానులంద‌రికీ చాలా కృత‌జ్ఞత‌లు. ఈనెల 24న ‘ఒక మ‌న‌సు’తో థియేట‌ర్లలో క‌లుద్దాం అని చెప్పుకొచ్చింది.

బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఒక మనసు’ సినిమాకు సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, వీడియోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై నిహారిక చాలా ఆశలే పెట్టుకుంది. మరి ఈ సినిమా హిట్టవుతుందో లేదో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika  Oka Manasu  Naga Shaurya  Mega Fans  

Other Articles

Today on Telugu Wishesh