ఈ టైటిల్ ఎందుకో తెలుసా? | Gentleman Censor Report

Gentleman censor report

Gentleman Censor Report, Gentleman movie release date, Gentleman movie posters, Gentleman movie stills, Gentleman movie trailers, Gentleman movie cast and crew, Gentleman movie videos, Gentleman movie

Gentleman Censor Report: Actor Nani upcoming film Gentleman will be release on 17 june. This film Censor complited.

ఈ టైటిల్ ఎందుకో తెలుసా?

Posted: 06/11/2016 09:06 AM IST
Gentleman censor report

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మ‌న్‌’ సెన్సార్ పూర్త‌యింది. ఈ నెల 17న విడుద‌ల కానుంది. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు.

నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.... మా చిత్రంలోని పాట‌ల‌కు, టీజ‌ర్‌కు, ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. మా చిత్రం సెన్సార్ పూర్త‌యింది. క్లీన్ యు స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు చాలా మంచి సినిమా చేశామ‌ని మెచ్చుకున్నారు. స‌కుటుంబంగా చూడ‌ద‌గ్గ చిత్రంగా తెర‌కెక్కించాం. ఈ నెల 17న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ‘జెంటిల్‌మ‌న్‌’ అనే టైటిల్ ఎందుకు పెట్టామ‌న్న‌ది సినిమా చూసి తెలుసుకోవాలి. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ కూడా హైలైట్‌గా ఉంటుంది. అంద‌మైన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇది. అన్ని ర‌కాల భావోద్వేగాలుంటాయి అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gentleman  Nani  Surabhi  

Other Articles