ఈ పోలీస్ తెగ నవ్వించేస్తాడట | Sharwanand become Police Officer

Sharwanand become police officer

Sharwanand become Police Officer, Sharwanand movie details, Sharwanand movie updates, Sharwanand latest news, Sharwanand stills, Sharwanand police stills, Sharwanand, BVSN Prasad films

Sharwanand become Police Officer: Senior producer B.V.S.N. Prasad, who has given many super hit films in a career spanning three decades, is now producing Young hero Sharwanand's 25th film.

ఈ పోలీస్ తెగ నవ్వించేస్తాడట

Posted: 06/11/2016 08:51 AM IST
Sharwanand become police officer

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వరుస విజయాలతో సోలో హీరోగా స్టార్డమ్ సంపాదించుకున్న శర్వానంద్ తో ఆయన 25వ సినిమాని నిర్మిస్తున్నారు. విన్నూత్నమైన కథలతో, మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తారు.

శర్వానంద్ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. అయన గతంలో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ఈనెల 15 నుండి ప్రారంభం అవుతుంది.

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పూర్తి వినోదాత్మకం గా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది అని అన్నారు.

ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. టైటిల్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలుపుతాం అని, ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharwanand  BVSN Prasad  Movie News  

Other Articles