గుంటూరులో ‘అఆ’ విజయోత్సవ వేడుక | A Aa Success Funtion in Guntur

A aa success funtion in guntur

A Aa Movie Success Funtion Date, A Aa Movie Success party, A Aa Movie collections, A Aa Movie Posters, A Aa Movie ratings, A Aa Movie stills, Nithin, Samantha, Anupama Parameshwaran, stills, hot news, movie updates, gallery

A Aa Movie Success Funtion Date: Nithin, Samantha, Anupama Parameshwaran acts in lead roles. Trivikram director.

గుంటూరులో ‘అఆ’ విజయోత్సవ వేడుక

Posted: 06/10/2016 03:52 PM IST
A aa success funtion in guntur

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘అఆ’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఇటీవలే విడుదల ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 12న గుంటూరులో ‘అఆ’ విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరులోని ‘సిద్ధార్ధ గార్డెన్స్’లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు విజయోత్సవ కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, నితిన్, సమంత, అనుపమ పరమేశ్వన్, నదియ, నరేష్, రావు రమేష్, అజయ్, హరితేజ, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్యలతో పాటు చిత్ర నటీ నటులు, సాంకేతిక నిపుణులు మరియు పలువురు రాజకీయ నాయకులు పాల్గొననున్నారని నిర్మాత తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A Aa Movie  Nithin  Trivikram  Samantha  Anupama Parameshwaran  

Other Articles

Today on Telugu Wishesh