తిడితేగానీ చేయాలనిపించలేదా? | Vishal upcoming telugu film

Vishal upcoming telugu film

Vishal upcoming telugu film, Vishal interviews, Vishal movies, Vishal stills, Vishal upcoming films, Vishal tamanna movies, Vishal

Vishal upcoming telugu film: Actor Vishal talks about his upcoming telugu films and Pandemokodi sequel.

తిడితేగానీ చేయాలనిపించలేదా?

Posted: 06/04/2016 03:50 PM IST
Vishal upcoming telugu film

తెలుగులో ‘పందెంకోడి’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విశాల్.. ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ విశాల్ కు తెలుగులో సరైన విజయం దక్కలేదు. కానీ తమిళంలో విశాల్ నటించిన దాదాపు అన్ని చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేసి, విడుదల చేసారు. తాజాగా విడుదలైన ‘రాయుడు’ సినిమా మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో విశాల్ మాట్లాడుతూ తెలుగులో ఇంత మంచి రెస్పాన్స్ రావడంతో మా అమ్మ కూడా ‘ఇప్పుడైనా నువ్వు తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయకపోతే నీ అంత ఇడియట్ ఉండడు’ అని కోపంగా తిట్టింది. అందుకే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయబోతున్నాను. ‘పందెంకోడి’ సినిమాకి సీక్వెల్ చేయాలనే ప్లాన్ వుందని విశాల్ చెప్పుకొచ్చాడు.

రాయుడు తర్వాత విశాల్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమా తెలుగు, తమిళం భాషలలో రూపొందనుంది. ఇందులో విశాల్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. జగపతిబాబు విలన్ పాత్రలో నటించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 9న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Tamanna  Jagapathi babu  Sri Divya  

Other Articles