అది వచ్చినట్లే.. నీ పెళ్లి అయ్యినట్లే! | Alia Bhatt talks about her marriage

Alia bhatt talks about her marriage

Alia Bhatt talks about her marriage, Alia Bhatt marriage details, Alia Bhatt oscar news, Alia Bhatt movie updates, Alia Bhatt movies, Alia Bhatt stills, Alia Bhatt

Alia Bhatt talks about her marriage: Bollywood young actress Alia Bhatt talks about her marriage and her upcoming films.

అది వచ్చినట్లే.. నీ పెళ్లి అయ్యినట్లే!

Posted: 06/04/2016 02:59 PM IST
Alia bhatt talks about her marriage

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్... ఆ తర్వాత పలు సినిమాలతోనే కాకుండా వరుస లవ్ రూమర్లతో భారీగా పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు తన సినిమాల కంటే రూమర్ల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. అంతే కాకుండా ఈ అమ్మడి జనరల్ నాలెడ్జ్ శూన్యం అంటూ చాలా వార్తలే వచ్చాయి. అలాంటి ఈ అమ్మడు ఆస్కార్ పై కన్నేసింది.

ప్రస్తుతం ఆలియా నటించిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ అమ్మడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆలియా మాట్లాడుతూ... ‘కొంతమంది అమ్మాయిలకు జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం పెళ్లి... కానీ నాకు మాత్రం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆస్కార్ సాధించటం’ అని చెప్పుకొచ్చింది.

ఈ అమ్మడి కామెంట్లకు అక్కడి వారంతా ఒక్కసారిగా ఖంగుతిని, ఆ తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ‘ఇక నీకు ఆస్కార్ వచ్చినట్లే.. నీ పెళ్లి అయినట్లే’ అంటూ అక్కడున్న వారంతా కూడా గుసగుసలాడారు. మరి ఆలియా నటించిన ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Udta Punjab  Hot stills  

Other Articles