ఎక్స్ క్లూజివ్: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబుర్లు | SJ Surya Talks About Pawan Kalyan Film

Sj surya talks about pawan kalyan film

SJ Surya Talks About Pawan Kalyan Film, Pawan Kalyan Film updates, Pawan Kalyan Movie News, Pawan Kalyan movie details, SJ Surya Pawan Kalyan film updates, Pawan Kalyan

SJ Surya Talks About Pawan Kalyan Film: Powerstar Pawan Kalyan upcoming film with director SJ Surya.

ఎక్స్ క్లూజివ్: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబుర్లు

Posted: 06/04/2016 12:42 PM IST
Sj surya talks about pawan kalyan film

‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ఎస్.జే.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. ఓ ఫ్యాక్షన్ హీరో లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఇప్పటికే దర్శకుడు ఎస్.జే.సూర్య ప్రకటించారు.

దీంతో అభిమానులు ఈ సినిమా ఎలా వుండబోతుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ ను పూర్తిగా మార్చేసారు. హెయిర్ స్టైల్ చాలా కొత్తగా వుంది. అయితే ఈ సినిమా గురించి ఎస్.జే.సూర్య తాజాగా ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు చెప్పుకొచ్చారు.


Video Source: tamilcinemareview

ఎస్.జే.సూర్య మాట్లాడుతూ... ఈ సినిమాలో హీరో చాలా మాస్ హీరో. కానీ లవ్ సీన్లతో కూడి వుంటుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్న ఓ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ. ఈ సినిమాను దసరాకు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఎస్.జే.సూర్య చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నప్పటికీ... ఏ హీరోయిన్ కూడా ఫైనలైజ్ అవ్వడంలేదని తెలిసింది. అందువల్ల షూటింగ్ లేటయ్యే అవకాశం వుందని చిత్ర దర్శకనిర్మాతలు భావించడంతో... హీరోయిన్ లేని సీన్లను ముందుగా షూటింగ్ చేసేయ్యమని పవన్ కళ్యాణ్ దర్శకనిర్మాతలకు చెప్పాడట. దీంతో మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమై, శరవేగంగా కొనసాగించనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  SJ Surya  Movie News  

Other Articles