అతనే తన భర్త అంటున్న సమంత | Samantha reveals about her lover

Samantha reveals about her lover

Samantha reveals about her lover, Samantha love story, Samantha marriage updates, Samantha loves with Naga chaithanya, Samantha movies, Samantha interviews, Samantha stills, Samantha, Nithin, A Aa collections

Samantha reveals about her lover: South actress Samantha reveals about her lover. Samantha latest film A Aa.

అతనే తన భర్త అంటున్న సమంత

Posted: 06/04/2016 11:00 AM IST
Samantha reveals about her lover

హీరోయిన్ సమంత ప్రేమ, పెళ్లి పుకార్లు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. గతంలో నటుడు సిద్ధార్థను పెళ్లి చేసుకోనుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాన్ ను సమంత పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు వినిపించాయి. అయితే ఈ పుకార్లను మరింత పెంచే విధంగా ఇటీవలే సమంత తాను చేసుకోబోయే వ్యక్తి పేరు ‘N’ తో స్టార్ అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ ‘N’ పేరు గల హీరో ఎవరని సినీవర్గాలు ఆరా తీయడం మొదలు పెట్టారు.

తాజాగా తను నటించిన ‘అఆ’ సినిమాను నాగచైతన్యతో కలిసి సమంత చూసింది. వీరిద్దరూ కలిసి చూడటంతో ఆ ‘N’ పేరు గల వ్యక్తి నాగచైతన్యే అంటూ వార్తలు ఎక్కువయ్యాయి. పైగా ఈ వార్తలపై సమంత ఏ విధంగా కూడా స్పందించకపోవడం విశేషం. ఇదిలా వుంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ‘అఆ’ సినిమా హీరో నితిన్ తో కలిసి ఓ టీవి ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.


Video Source: NTV Telugu

ఈ కార్యక్రమంలో యాంకర్ బలవంతం మేరకు హీరో నితిన్ ‘మీరు చెప్పిన ఆ ‘N’ పేరు గల వ్యక్తి ఎవరు?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా సమంత స్పందిస్తూ.. ఆ ‘N’ వ్యక్తి నితినే అంటూ చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా తన భర్త నితిన్ అని ఫీల్ అవుతూ.. ‘ఏమండి.. చెప్పండి’ అంటూ తెగ సిగ్గుపడిపోయింది. సమంత చెప్పిన సమాధానానికి నితిన్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

కానీ తన పెళ్లి మాత్రం ఈ ఏడాది లేదంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ మధ్య సమంత మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రోజుకో మాట చెబుతుంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. మరి ఇంతకీ ఆ ‘N’ వ్యక్తి ఎవరో సమంత సరైన క్లారిటీ ఇవ్వకుండానే తప్పించుకుంది.

- Sandy


Video Source: NTV Telugu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Samantha  A Aa Movie  Nithin  

Other Articles