‘అభినేత్రి’ టీజర్ అదుర్స్.. ప్రభుదేవా ఈజ్ బ్యాక్ | Abhinetri Movie Teaser

Abhinetri movie teaser

Abhinetri Movie Teaser, Abhinetri song release date, Abhinetri movie updates, Abhinetri stills, Abhinetri posters, Prabhudeva Abhinetri, Tamanna Abhinetri, Tamanna stills, Tamanna posters

Abhinetri Movie Teaser: Starring Tamanna Bhatia, Prabhu Deva and Amy Jackson. Presented by Kona Venkat and directed by Vijay. Music composed by Sajid - Wajid, GV Prakash Kumar and Vishal.

‘అభినేత్రి’ టీజర్ అదుర్స్.. ప్రభుదేవా ఈజ్ బ్యాక్

Posted: 06/04/2016 10:18 AM IST
Abhinetri movie teaser

తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘అభినేత్రి’. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు.

సోనూసూద్, అమీజాక్సన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో ప్రభుదేవా తన డాన్సింగ్ స్టైల్ తో మరోసారి అదరగొట్టేసాడు. ఈ టీజర్ మ్యూజిక్ సూపర్. అమీజాక్సన్ లుక్స్ పరంగా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. కానీ ఈ టీజర్ లో తమన్నా, సోనూసూద్ లకు సంబంధించిన సీన్లు లేవు. మరికొద్ది రోజుల్లోనే తమన్నాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు.

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, అమీజాక్సన్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాజిద్-వాజిద్,జి.వి.ప్రకాష్‌కుమార్‌, విశాల్; సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhinetri  Prabhudeva  Tamanna  

Other Articles