Trivikram next movie release date declared

Nithiin s a aa to release date comformed

A Aa Movie, Release Date, Trivikram Srinivas, Nithin, Anupama Parameshwaran, mickey j meyer, Samantha Ruth Prabhu

The release date of the much awaited movie 'A Aa' has been finalized for June 2.

త్రివిక్రమ్ అ ఆ మూహూర్తం ఖారురు

Posted: 05/22/2016 04:08 PM IST
Nithiin s a aa to release date comformed

నితిన్, సమంత జంటగా నటిస్తున్న ‘అ..ఆ..’ చిత్రం విడుదలకు ముహూర్తం ఖరారైంది, మాటల మాంత్రికుడిగా ఖ్యాతి గడించిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని జూన 2న విడుదల చేయాలని భావిస్తున్నాడు.  త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స సంస్థ నిర్మించింది. అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి అనేది ఉపశీర్షిక. నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ‘‘త్రివిక్రమ్‌ కలం నుంచి జాలువారిన మంచి ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ డ్రామా ఇదని అన్నారు.

ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. మిక్కీ సంగీతం అందరినీ మెప్పిస్తోంది. జూన 2న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. అనుపమ పరమేశ్వరన్ మరో నాయిక. నదియ, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, పోసాని, నరేశ్, రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్‌, ప్రవీణ్‌, రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్‌ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ.జె.మేయర్‌, కెమెరా: నటరాజ్‌ సుబ్రమణియన్, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైన్: విష్ణు గోవింద్‌, శ్రీ శంకర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్‌, సమర్పణ: మమత.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles