mahesh babu prince collections below sardar gabbar siigh

Prince mahesh babu misses record

brahmostsavam, brahmotsavam box office collection, mahesh babu, srikanth addala, samantha ruth prabhu, pawan kalyan, sardar gabbar singh

Trade analysts predicted that Brahmotsavam might overtake the box office collection of Pawan Kalyan's Sardaar Gabbar Singh. However, things turned out differently for Mahesh Babu's film.

‘సర్థార్’ రికార్డులను పథిలం చేసిన ప్రిన్స్

Posted: 05/22/2016 03:25 PM IST
Prince mahesh babu misses record

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు నాట అన్ని రికార్డులు తిరగరాస్తుందని భావించారు. ఇక నాన్ బాహుబలి రికార్డులన్ని మహేష్ సొంతం కావటం ఖాయం అన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది.

అయితే అనుకున్నట్టుగా మహేష్ రికార్డ్లు తిరగరాయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇతర హీరోల రికార్డులనే కాదు, తన పాత రికార్డులను కూడా బ్రేక్ చేయలేకపోయాడు. తొలి రోజు కలెక్షన్ల విషయంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సర్థార్ గబ్బర్సింగ్ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బ్రేక్ చేయగా, ఆ రికార్డ్లను బ్రహ్మోత్సవంతో మహేష్ తిరగరాస్తాడని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. మహేష్, సర్థార్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. సర్థార్ గబ్బర్సింగ్ 29 కోట్లతో ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తే, మహేష్ మాత్రం 18 కోట్లతో సరిపెట్టుకున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  brahmostavam  srikanth addala  Pawan kalyan  

Other Articles