ఐసియూలో రెబల్ స్టార్ | Actor Krishnam Raju Hospitalized

Actor krishnam raju hospitalized

Actor Krishnam Raju Hospitalized, Krishnam Raju health updates, Krishnam Raju health issues, Krishnam Raju health conditions, Krishnam Raju latest updates, Krishnam Raju news, Prabhas

Actor Krishnam Raju Hospitalized: Prabhas' uncle Krishnam Raju hospitalized in Hyderabad. Rebel Star Krishnam Raju has been hospitalized after he complained of difficulty in breathing and has been kept under observation.

ఐసియూలో రెబల్ స్టార్

Posted: 05/17/2016 01:45 PM IST
Actor krishnam raju hospitalized

తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా కొనసాగుతున్న నటుడు కృష్ణంరాజు అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో కృష్ణంరాజుని ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిసింది.

కృష్ణంరాజు అస్వస్థత గురయ్యారని తెలిసి నిన్న ఉదయం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాస్పిటల్లో దాదాపు గంట సమయం పాటు కృష్ణంరాజు వద్దనే వున్నారని సమాచారం. అయితే కృష్ణంరాజు గతకొద్ది రోజులుగా శ్వాసకు సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే... కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు ‘ఒక్క అడుగు’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. అతి త్వరగా కృష్ణంరాజు ఆరోగ్యం బాగుపడి, ప్రభాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని... ఆయన మరింత ఆరోగ్యంగా వుండాలని కోరుకుందాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnam Raju  Hospitalized  Prabhas  Health conditions  

Other Articles