తమన్నాకు కాదన్న హీరో | Hero Rejects Tamana

Hero rejects tamana

Tamanna, Tamanna cinemas, Tamanna stills, Tamanna latest news, Tamanna in tollywood, Tamanna latest news, తమన్నా

In A telugu Movie, A hero rejects Tamanna. Telugu Hero Ram Reject Tamanna in his upcoming film.

తమన్నాను కాదన్న హీరో

Posted: 05/17/2016 03:27 PM IST
Hero rejects tamana

మిల్కీ బ్యూటీగా గుర్తింపుతెచ్చుకున్న తమన్నా అంటే మన తెలుగు హీరోలు పడిచస్తారు అనే టాక్ ఉంది. ఊపిరి సినిమాతో ప్రస్తుతం సక్సెస్ బాటలో నడుస్తున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో బాహుబలి రెండో పార్ట్ లో తప్ప వేరే సినిమాల్లో నటించడం లేదు. హిందీలో మాత్రం ఓ సినిమాలో నటిస్తోంది. కాగా తాజాగా ఓ తెలుగు సినిమాకు ఓకే అయిపోయింది అనుకున్న తర్వాత ఆ సినిమా హీరో మాత్రం అమ్మడును వద్దన్నాడని టాక్ వినిపిస్తోంది. తమన్నాను వద్దన్న హీరో ఎవరు అనుకుంటున్నారా..?

తమన్నాను వద్దన్నది ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు ఉన్న రామ్. ఎందుకంటే ప్రేమంట సినిమాలో తమన్నాతో కలిసి నటించిన రామ్.. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా వీరిద్దరి జంటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రామ్ తో చేస్తున్న సినిమాలో తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ రామ్ మాత్రం తమన్నాను కాదని.. ఆ ప్లేస్ లో రాశి ఖన్నాను తీసుకోవాలని సూచించాడట. అయితే దీనికి కొంత మంది వేరేలా సమాధానమిస్తున్నారు. తమన్నా రిమ్యునరేషన్ కారణంగానే ఆమెను పక్కనపెట్టారని తెలుస్తోంది. ఐటెం సాంగ్ కే కోటిన్నర తీసుకుంటున్న తమన్నా.. సినిమాకు రెండు కోట్లు తీసుకుంటోందట. అందుకే రిమ్యునరేషన్ కారణంగా తమన్నాను తప్పించారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles