24 Official Trailer ! Telugu | Suriya | Samantha | AR Rahman | 2D Entertainment | Vikram K Kumar

Nithya menen croons a lullaby for 24

24 Official Trailer, 24 Telugu movie, Nithya Menen, Suriya, kollywood, tollywood, sandalwood, Samantha, AR Rahman, 2D Entertainment, Vikram K Kumar, Eros Now, Studio Green, Saranya Ponvanan, Girish Karnad, Sathyan

“24” is a science fiction thriller film starring Suriya, Samantha and Nithya Menon in the lead roles

తీయని కోరిక తీర్చుకున్న నిత్యా మీనన్

Posted: 04/24/2016 05:19 PM IST
Nithya menen croons a lullaby for 24

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటి నిత్యామీనన్. సహజమైన నటనే కాదు పాటలు పాడటంలోనూ తను ప్రొఫెషనలే. అయితే తనకు జీవితంలో ఒక కోరిక ఉందని, అది ఇటీవలే తీరిపోయిందంటోందీ ముద్దుగుమ్మ. నటన సంగతి పక్కన పెడితే నిత్యామీనన్ తెలుగులో నటించిన అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల్లో తన గాత్రంతో కూడా అలరించింది. అయితే తనకు ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టమని, అతని దర్శకత్వంలో ఒక్క పాటైనా పాడాలని గతంలో చాలా సార్లు చెప్పింది.

ఇప్పుడు నిత్యామీనన్ కోరిక తీరిపోయింది. విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో సూర్య, సమంత, నిత్యామీనన్ జంటగా వస్తున్న “24” చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఒక లాలి పాటను నిత్యామీనన్ పాడింది. ఎందరో ప్రొఫెషనల్ సింగర్స్ రెహమాన్ దర్శకత్వంలో పని చేయాలనుకుంటారు. నాకు ఆ కోరిక తీరడం చాలా ఆనందంగా ఉందని నిత్య అంటోంది. తను పాడిన జోల పాట హిట్టవ్వడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేవంట. మీరూ తన ఆనందాన్ని చూడాలనుకుంటే కింద ఉన్న యూట్యూబ్ లింక్ ను ప్రెస్ చేయండి.
 
జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  Suriya  24  song  

Other Articles

Today on Telugu Wishesh