మే నెలలో సందడి చేయనున్న ‘సుప్రీం’ | Supreme Film Release on May First Week

Supreme film release on may first week

Supreme Film Ready to release, Supreme Trailer, Supreme Full Songs Jukebox, Supreme Pre Business in guntur, Supreme Pre Business details, Supreme movie teaser, Supreme movie stills, Supreme movie posters, Saidharam Tej latest stills, Saidharam Tej movies, Saidharam Tej

Supreme Film Release on May First Week: Starring Sai Dharam Tej, Raashi Khanna, Music composed by Sai Kartheek, Directed by Anil Ravipudi and Produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations.

మే నెలలో సందడి చేయనున్న ‘సుప్రీం’

Posted: 04/23/2016 07:08 PM IST
Supreme film release on may first week

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మే మొదటి వారం లో భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తో సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న మూడవ చిత్రం ఇది.

"సుప్రీమ్ అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్.వేసవి సెలవుల్లో కుటుంబ సమేతం గా చూసి ఎంజాయ్ చేసే చిత్రం. మే మొదటి వారంలో భారీ విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఆడియో కు మంచి స్పందన వస్తోంది . సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి అని శిరీష్ అన్నారు.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. ఏక్షన్ , కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది అన్నారు.

సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకత్వం - స్క్రీన్ప్లే - అనిల్ రావిపూడి. రచనా సహకారం - సాయి కృష్ణ. సినిమాటోగ్రఫీ - సాయి శ్రీరామ్ . ఆర్ట్ - ఏ .ఎస్ ప్రకాష్ - ఎడిటర్ - ఎమ్ అర్ వర్మ . సంగీతం - సాయి కార్తీక్ . నిర్మాత - శిరీష్ . సమర్పకులు - దిల్ రాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Sai Dharam Tej  Raashi khanna  Stills  

Other Articles