ప్రేమలో మునిగితేలుతున్న సమంత, అఖిల్ | Samantha and Akhil Love Story

Samantha and akhil love story

Samantha Latest Love Story, Samantha New Love Story, Samantha love news, Samantha latest updates, Samantha movie updates, Akkineni Akhil love story, Akkineni Akhil lovely pet, Akkineni Akhil tweets, Akkineni Akhil latest updates, Akkineni Akhil stills, Akkineni Akhil, Samantha tweets

Samantha and Akhil Love Story: Telugu actress samantha and actor akkineni akhil love story latest updates.

ప్రేమలో మునిగితేలుతున్న సమంత, అఖిల్

Posted: 04/23/2016 02:37 PM IST
Samantha and akhil love story

స్టార్ హీరోయిన్ సమంత, యువ హీరో అక్కినేని అఖిల్ ప్రేమలో పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా వీరిద్దరూ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం వరుస సినిమాలతో బిజీగా వున్న సమంత... గతంలో నటుడు సిద్ధార్థతో ప్రేమాయణం కొనసాగించింది. సిద్ధార్థతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందని భావించిన వారందరికి షాక్ ఇస్తూ... సిద్ధార్థకు హ్యండ్ ఇచ్చేసింది.

ఇక అప్పటినుంచి మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సూర్య సరసన ‘24’, తెలుగులో మహేష్ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కానీ సమంత మాత్రం తన లవ్ స్టోరీలో బిజీగా వుంది.

ఇక అక్కినేని అఖిల్ తన తొలిసినిమా ‘అఖిల్’ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ... అభిమానుల్లో మంచి క్రేజ్ ప్రస్తుతం తన రెండవ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అలాంటి అఖిల్ కూడా ప్రేమలో పడ్డాడట. అయితే అటు సమంత, ఇటు అఖిల్ ఇద్దరూ కూడా ఒకరికొకరు కాకుండా వేరువేరుగా ప్రేమలో పడ్డారు. సమంత ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో మరియు జిమ్ లో కనిపిస్తోంది.

తాజాగా తన సోషల్ మీడియాలో ‘మై లవ్ స్టోరీ విత్ ది జిమ్’ అంటూ ఓ ఫోటో పెట్టింది. అలాగే అఖిల్ కూడా తన పెంపుడు కుక్క ‘ఖలిసి’యే తన క్వీన్ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. నా జీవితానికి క్వీన్ ఆమెనే అంటే ఖలిసితో వున్న ఫోటోను పోస్ట్ చేసాడు అఖిల్. ఏదేమైనా వీరిద్దరూ ప్రేమలో వుండటం మంచిదేనని అందరూ భావిస్తున్నారు. ఒకరు పెంపుడు కుక్కతో.. మరొకరు డంబుల్స్, జిమ్ వస్తువులతో. బాగుంది.. చాలా బాగుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Akkineni Akhil  Samantha  Love Story  

Other Articles

Today on Telugu Wishesh