ఎవరికి చెప్పకుండా రాత్రి పెళ్లిచేసుకున్న షకలక శంకర్ | Comedian Shakalaka Shankar gets married

Comedian shakalaka shankar gets married

Shakalaka Shankar gets married, Shakalaka Shankar marriage, Shakalaka Shankar wedding, Shakalaka Shankar secreat wedding, Shakalaka Shankar marriage stills, Shakalaka Shankar videos, Shakalaka Shankar comedy skits, Shakalaka Shankar stills

Comedian Shakalaka Shankar gets married: Tollywood comedian Shakalaka Shankar gets married. Popular comedian Shakalaka Shankar, who shot to fame with comedy show Jabardasth got married on Friday.

ఎవరికి చెప్పకుండా రాత్రి పెళ్లిచేసుకున్న షకలక శంకర్

Posted: 04/23/2016 11:20 AM IST
Comedian shakalaka shankar gets married

ఈమధ్య ‘జబర్ధస్త్’ కార్యక్రమంలో వచ్చే ప్రతి ఒక్కరు ఓ ఇంటివారవుతుండటం విశేషంగా వుంది. నిన్న చలాకీ చంటి పెళ్లి ఖరారు కాగా.. ఇపుడు ఆయన శిష్యుడు షకలక శంకర్ ఏకంగా పెళ్లి చేసేసుకున్నాడు. ‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ నిన్న రాత్రి పెళ్లి చేసుకున్నాడు.

శ్రీకాకుళంలోని అరసవల్లిలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో రాత్రి ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా షకలక శంకర్ తన మేనమామ కూతురు పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంధర్భంగా షకలక శంకర్ మీడియాతో మాట్లాడుతూ... తన తండ్రి మొక్కు కారణంగా అరసవల్లిలో పెళ్లి చేసుకున్నానని, కోట్లాది మంది మొక్కే ప్రత్యక్షదైవమైన ఆ సూర్యనారయణ స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం ఆనందంగా వుందని తెలిపారు. అయితే ఈ వివాహానికి తన తోటి నటులెవరనీన కూడా ఆహ్వానించలేదన్నారు.

పెళ్లిని హంగు, ఆర్భాటాలతో పెళ్లి చేసుకోవడం కంటే సేవా కార్యక్రమాలను చేయడానికే ముందుంటానని, పుట్టిన గడ్డరుణం తీర్చుకుంటానని, అందుకోసం ఓ ప్రణాళిక వేసుకున్నానని షకలక శంకర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి షకలక శంకర్ ఓ ఇంటివాడవ్వడంతో తన తోటి నటీనటులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakalaka Shankar  Sardaar Gabbar Singh  Stills  

Other Articles

Today on Telugu Wishesh