బాలయ్య 100వ సినిమా టీజర్(ఫ్యాన్ మేడ్) | Gautamiputra Satakarni Fan Made Teaser

Gautamiputra satakarni fan made teaser

Balakrishna Gautamiputra Satakarni Fan Made Teaser, Balakrishna speech in Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie First Look, Gautamiputra Satakarni Shooting updates, బాలకృష్ణ, కేసిఆర్, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Gautamiputra Satakarni Fan Made Teaser: Here is the fanmade trailer of Nandamuri Balakrishna's upcoming movie GautamiPutra Satakarni directed by krish jagarlamudi and produced by Saibabu Jagarlamudi & Y. Rajeev Reddy. An unsung story of India's greatest warrior emperor, under their banner First First Frame Entertainment banner.and music composed by Devi Sri Prasad.

బాలయ్య 100వ సినిమా టీజర్(ఫ్యాన్ మేడ్)

Posted: 04/23/2016 03:41 PM IST
Gautamiputra satakarni fan made teaser

నందమూరి బాలకృష్ణ క్రేజ్ రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో దుమ్మురేపుతున్నాడు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ తో భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి బాలయ్య ప్రస్తుతం ఓ చారిత్రాత్మక కథాంశంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

బాలయ్య 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న టాలీవుడ్ సినీ ప్రముఖులు సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసీఆర్ గారి సమక్షంలో ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఈనాటి అఖండ భారతదేశానికి ఆనాడే అంకురార్పణ చేసిన రారాజు గౌతమీ పుత్ర శాతకర్ణి. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితాన్ని తెలుసుకుంటే రోమాంచితమవుతుంది. కృష్ణానదీ తీరాన అమరావతిని, గోదావరి తీరంలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాల పల్లిని, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ప్రతిష్ఠానపురంను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు గౌతమీ పుత్ర శాతకర్ణి. అలాంటి గొప్ప వీరుడి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమే బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’.

ఇందులో బాలయ్య టైటిల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేసిన తర్వాత... అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అసలు ఈ సినిమా ఎలా వుండబోతుంది? ఇందులో బాలయ్య ఎలా కనిపించనున్నాడు? అంటూ సినీజనాలు తెగ చర్చించేసుకుంటున్నారు. చర్చలతో పనిలేదు.. సినిమా ఇలా వుండబోతుందేమోనని అనిపించే విధంగా.. కొంతమంది బాలయ్య అభిమానులు లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ టీజర్ ను సిద్ధం చేసి, విడుదల చేసారు.


Video Source: Filmylooks

హిందీలో వచ్చిన ‘భాజీరావ్ మస్తానీ’ సినిమాలోని పలు యాక్షన్ సీన్లను తీసుకొని, అందులోని కొన్ని పాత్రలకు బాలయ్య మొహన్ని సెట్ చేసి, ఓ టీజర్ రూపంలో విడుదల చేసారు. ఎడిటింగ్ విషయం కాస్త పక్కన పెడితే... ఈ టీజర్ బాగానే వుంది. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ సినిమాలో మరీ ఇంతగా పోరాట సన్నివేశాలు వుంటాయా అని అనిపించేలా వుంది. కానీ మొత్తానికి ఫ్యాన్స్ డిజైన్ చేసిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే బాలయ్య తన లుక్ ను టోటల్ గా మార్చేసారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఓ ఛాలెంజ్ గా తీసుకుని తెరకెక్కించబోతున్నారు. విజువల్స్ వండర్ గా భారీ గ్రాఫిక్స్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్పణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ర‌చ‌నా స‌హ‌కారం - భూప‌తిరాజా; మాట‌లు - సాయిమాధ‌వ్ బుర్రా; పాట‌లు - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి; ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ - భూపేష్ ఆర్.భూప‌తి; స్టిల్స్ - జీవ‌న్ రెడ్డి; డి.ఓ.పి - జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్; ఫైట్స్ - రామ్,ల‌క్ష్మణ్; డాన్స్ - బృంద‌; ఎడిటింగ్ - సూర‌జ్; సంగీతం - దేవిశ్రీప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - కొమ్మినేని వెంక‌టేశ్వర‌రావు; నిర్మాత‌లు - వై రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు; ర‌చ‌న - ద‌ర్శక‌త్వం - జాగ‌ర్లమూడి రాధాకృష్ణ (క్రిష్).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamiputra Satakarni  Teaser  

Other Articles