వాటికి తన చిటికెన వేలు కూడా కదలలేదట | Balakrishna speech in Gautamiputra Satakarni Launch

Balakrishna speech in gautamiputra satakarni launch

Balakrishna speech in Gautamiputra Satakarni Launch, Gautamiputra Satakarni Movie First Look, Gautamiputra Satakarni Shooting updates, బాలకృష్ణ, కేసిఆర్, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Balakrishna speech in Gautamiputra Satakarni Launch: Nandamuri Balakrishna 100th film Gautamiputra Satakarni launched today. Krish director. Devisriprasad music.

వాటికి తన చిటికెన వేలు కూడా కదలలేదట

Posted: 04/22/2016 03:29 PM IST
Balakrishna speech in gautamiputra satakarni launch

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్పణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ అతిరథ మహారధులు విచ్చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కె.రాఘవేంద్రరావు మరియు సింగీతం శ్రీనివాస్ రావు గారు చిత్ర యూనిట్ కు స్ర్కిప్ట్ మరియు క్లాప్ ను అందజేసారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్లాప్ కొట్టగా, దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, విక్టరీ వెంకటేష్ కెమెరా ఆపరేటర్ చేసారు.


Video Source: V6 News Telugu

అనంతరం బాల‌కృష్ణ మాట్లాడుతూ... నా వంద‌వ సినిమా కోసం ఎన్నో క‌థ‌లు విన్నాను. అందులో కొన్ని క‌థ‌లు న‌చ్చాయి. కొన్ని న‌చ్చ‌లేదు. కొన్ని క‌థ‌లు న‌చ్చినా వంద‌వ చిత్రం స్ధాయికి త‌గ్గ‌ట్టు లేవు. కొత్త‌ద‌నం కోసం త‌పిస్తూ నాన్న‌గారు ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్య‌మైన పాత్రలు పోషించారు. నాన్న‌గారు లాగే నేను కూడా కొత్త పాత్ర‌లు పోషించాల‌ని త‌పిస్తుండేవాడిని. ఆ త‌ప‌నే న‌న్ను ముందుకు న‌డిపిస్తుంది. వందవ‌ సినిమా స్ధాయికి త‌గ్గ క‌థ‌ను క్రిష్ చెప్పడంతో నేను అంగీక‌రించాను. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి గురించి చాలా మందికి తెలియ‌దు. తెలంగాణ‌లోని కోటిలింగాలులో పుట్టి అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఏర్పాటు చేసి పరిపాలించాడు. మ‌న తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గురించి మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంత‌ర్జాతీయంగా తెలియ‌చేయాలి. నాన్న‌గారు న‌ర్త‌న‌శాల సినిమా చేసేట‌ప్పుడు ఎలాగైతే ప‌రిశోధించి సినిమా చేసారో..అలా ఈ సినిమా కోసం చాలా మంది రీసెర్చ్ చేసి స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. 1973లో నాన్న‌గారు నా నుదిట న‌ట తిల‌కం దిద్దారు. అప్ప‌డ‌ప్పుడు అప‌జ‌యాలు వ‌చ్చినా నా చిటికెన వేలును కూడా క‌దిలించ‌లేదు. ఎన్నో శ‌త‌దినోత్సవ చిత్రాల్లో న‌టించానంటే త‌ల్లిదండ్రుల‌ పుణ్యఫ‌లం. తెలుగు ప్రజ‌ల అభిమాన బ‌లం. ఈ చిత్రాన్ని నా అభిమానుల‌కు భార‌త‌దేశంలో ఉన్న త‌ల్లుల‌కు అంకితం ఇస్తున్నాను. మ‌న తెలుగు యోధుడు క‌థ ప్ర‌పంచానికి తెలియాల్సి ఉంది. అందుకే ఈ చిత్రం చేస్తున్నాను. ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మ‌నిషి కాదు. అదే నా జీవితం. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవితం కూడా అదే అని ఈమ‌ధ్య పుస్తకాలు చ‌ద‌వ‌డం వ‌ల‌న తెలిసింది అని అన్నారు.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ - బిబో శ్రీనివాస‌రావు, ర‌చ‌నా స‌హ‌కారం - భూప‌తిరాజా, మాట‌లు - సాయిమాధ‌వ్ బుర్రా, పాట‌లు - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ భూపేష్ ఆర్.భూప‌తి, స్టిల్స్ - జీవ‌న్ రెడ్డి, డి.ఓ.పి - జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్, ఫైట్స్ - రామ్ ల‌క్ష్మ‌ణ్, డాన్స్ - బృంద‌, ఎడిటింగ్ - సూర‌జ్, సంగీతం - దేవిశ్రీప్ర‌సాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్మాత‌లు - వై రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం - జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamiputra Satakarni  First Look  

Other Articles