Saidharam Tej | Supreme | Audio Review | Supreme Jukebox | Raashi Khanna | Teaser

Supreme songs jukebox

Supreme Songs Review, Supreme Full Songs Jukebox , Supreme Pre Business in guntur, Supreme Pre Business details, Supreme movie teaser, Supreme movie stills, Supreme movie posters, Saidharam Tej latest stills, Saidharam Tej movies, Saidharam Tej

Supreme Songs Jukebox: Starring Sai Dharam Tej, Raashi Khanna, Music composed by Sai Kartheek, Directed by Anil Ravipudi and Produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations.

ఆడియో రివ్యూ... ‘సుప్రీం’ మాస్ మసాలా ఆల్బం

Posted: 04/14/2016 01:46 PM IST
Supreme songs jukebox

‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుప్రీం’. ‘పటాస్’ ఫేం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు.

ఈరోజు అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ పాటలను ముందుగానే సోషల్ మీడియాలో విడుదల చేసారు. మరి ఈ పాటలు ఎలా వున్నాయో ఒకసారి చూద్దామా!

1. టాక్సీ వాలా...
ఈ పాటకు శ్యామ్ కాసర్ల సాహిత్యం అందించారు. జాస్ ప్రీత్ జాస్, దివిజ కార్తీక్ పాడారు. స్టైలిష్ మాస్ బీట్ తో ఈపాట మొదలవుతుంది. ఈ పాటకు ప్రధానాకర్షణ బీట్. సాయికార్తీక్ ఈ పాటకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వినగానే వెంటనే నచ్చే విధంగా బీట్ ను సెట్ చేసారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ తన ప్రేయసితో పాడుకునే మాస్ పాట తరహాలో సాగుతోంది. బీట్ మాత్రం అదిరింది. సాహిత్యం కూడా చాలా బాగుంది.

2. ఆంజనేయుడు నీవాడు....
ఈ పాటను కార్తీక్, సూరజ్ సంతోష్, దీప్తీ పార్థసారథి కలిసి పాడారు. రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు లిరిక్స్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ప్రేమికుడిని నమ్మితే చాలు ఎంతటి సమస్యనైనా తీర్చగలడు అంటూ భరోస ఇచ్చే పాటలా వుంది. చాలా కూల్ గా, మెలోడీ తరహాలో ఈ పాట సాగుతుంది.

3. బెల్లం శ్రీదేవి....
ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... సాయి చరణ్ పాడారు. బెల్లం శ్రీదేవి.. నా పెళ్లం శ్రీదేవి అంటూ సాగే ఈ పాట హీరోయిన్ ను హీరో టీజింగ్ చేసే సన్నివేశంలో వచ్చే విధంగా కనిపిస్తుంది. తన ప్రేమను ఒప్పుకోమంటూ హీరో తనదైన మాస్ స్టైల్ లో ప్రపోజ్ చేస్తూ పాడే పాట ఇది. ఈ పాటలో ప్రేమను వ్యక్తపరచడంతో పాటు... మాస్ బీట్ అదిరింది. విజువల్స్ పరంగా డాన్స్ స్టెప్పులు ఎక్కువగా వుండే అవకాశం వున్నట్లుగా అనిపిస్తుంది.

4. ఛలో ఛలో...
రామజోగయ్య సాహిత్యమందించిన ఈ పాటను క్రిష్ణ చైతన్య పాడారు. ఈ పాటలోని లిరిక్స్ మెలోడి తరహాలో వున్నప్పటికీ.. వెస్ట్రన్ బీట్ తో కంపోజ్ చేయడంతో స్టైలిష్ సాంగ్ లా అనిపిస్తుంది. ఈ పాట వినడానికి పర్వాలేదనిపిస్తున్నా... విజువల్స్ పరంగా చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.

5. అందం హిందోలం...
చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ లలో ఒకటైన్ ‘అందం హిందోలం’ అనే పాటను ఈ సినిమా కోసం రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ సాంగ్ ను రేవంత్, చిత్ర కలిసి పాడారు. ఈ పాటను సాయికార్తీక్ పర్ఫెక్ట్ గా రీమేక్ చేసారని చెప్పుకోవచ్చు. చాలా గ్రాండియర్ గా వుండబోతుందని అర్థమవుతోంది. కొత్త బీట్స్ తో వినడానికి వినసొంపుగా రూపొందించారు. ఈ పాట ఆల్బంలోనే కాకుండా సినిమాలో కూడా చివరి పాట అవుతుందేమోనని భావించవచ్చు.

మొత్తానికి ఈ 5 పాటలు అదిరిపోయాయి. ‘పటాస్’ తర్వాత మళ్లీ అదే స్థాయిలో సాయికార్తీక్ ‘సుప్రీం’ సినిమాకు అదిరిపోయే పాటలను అందించాడని చెప్పుకోవచ్చు. ఈ పాటల విడుదల కార్యక్రమాన్ని ఈరోజు శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుపనున్నారు. కమర్షియల్ లవ్, మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా సాయిధరమ్ తేజ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Sai Dharam Tej  Audio Jukebox  Audio Review  Raashi khanna  Teaser  Stills  

Other Articles