Director Sriram Aditya | Elopes | bride | Love | stills

Director sriram aditya elopes with his girl friend

Director Sriram Aditya Elopes with a bride, Sriram Aditya Elopes, Sriram Aditya Elopes with his girl friend, Sriram Aditya love, Sriram Aditya Elopes news, Sriram Aditya stills

Director Sriram Aditya Elopes with his girl friend: As per latest sources... Bhale Manchi Roju film Director Sriram Aditya Elopes with his girl friend.

తన ప్రేయసితో యువ దర్శకుడు జంప్ జిలానీ?

Posted: 04/14/2016 12:09 PM IST
Director sriram aditya elopes with his girl friend

‘భలే మంచి రోజు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య.. తన సినిమాలోని ఓ సీన్ ను నిజ జీవితంలో వాడేసుకున్నాడు. ‘భలే మంచి రోజు’ చిత్రంలో కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు తనకు నచ్చిన యువకుడితో లేచిపోయే సీన్ వుంటుంది. ఆ సీన్ ను శ్రీరామ్ ఆదిత్య తన నిజజీవితంలో వాడేసాడు.

తాజా సమాచారం ప్రకారం... మరో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని తీసుకొని శ్రీరామ్ ఆదిత్య ఎలోప్ అయ్యాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే... శ్రీరామ్ ఆదిత్య గతకొద్ది రోజులుగా ఓ అమ్మాయితో ప్రేమలో వున్నాడు. అయితే ఆ అమ్మాయి తల్లితండ్రులు మరో వ్యక్తితో ఈనెల 17న పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లికార్డులు కూడా పంచేసారని తెలిసింది.

కానీ మంగళవారం ఆ యువతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా శ్రీరామ్ ఆదిత్యతో వెళ్లిపోయిందట. ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు మాత్రం చెయ్యలేదని తెలిసింది. మరి శ్రీరామ్ ఆదిత్యపై ఫిర్యాదు చేయకపోవడానికి కారణమేంటి? శ్రీరామ్ ఆదిత్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? అనే విషయాలు తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sriram Aditya  Elopes  Love  Bride  Bhale Manchi Roju director  

Other Articles