Sardaar Gabbar Singh | Piracy cd | Pawan kalyan | Review

Sardaar gabbar singh piracy cds in market

Sardaar Gabbar Singh Piracy in Market, Sardaar Gabbar Singh in Market, Sardaar Gabbar Singh cd, Sardaar Gabbar Singh Review, Sardaar Gabbar Singh talk, Sardaar Gabbar Singh public talk, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan, Kajal

Sardaar Gabbar Singh Piracy CDs in Market: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh Film will be releasing tomorrow. Bobby director, DSP Music. Kajal Heroine.

మార్కెట్లోకి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పైరసీ సిడీలు?

Posted: 04/07/2016 11:24 AM IST
Sardaar gabbar singh piracy cds in market

తెలుగు సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఇండియాలో ఏప్రిల్ 8న, విదేశాల్లో ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమా అంతా కూడా పైరసీ అయ్యి, సిడీలుగా అమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రాంతాల్లో పుకార్లు రావడంతో పోలీసులు మరియు ఇంటలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యారు. సైబర్ క్రైం డిపార్ట్ మెంట్ వారు పైరసీని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పుకార్లు రావడంతో వెంటనే పోలీసులు కడప జిల్లాతో పాటు పొద్దుటూరు పక్క ప్రాంతాలలో వున్న సిడీ షాపులలో రైడ్ చేసారు.

పోలీసుల తనిఖిలో ఎలాంటి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సిడీలు దొరకకపోవడంతో ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని తేల్చేసారు. అంతటితో ఆగకుండా పైరసీ చేసే వ్యక్తులను ముందుగానే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని వుంచారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఎలాంటి పైరసీ కాకుండా పోలీసులు, సైబర్ టీం తగిన చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే పైరసీ అయ్యి.. పూర్తి సినిమా బయటకు వచ్చేసింది. అయినప్పటికీ ఆ సినిమా రికార్డుల మోత మోగించేసింది. ఇక ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలాంటి రికార్డులు తిరగరాయనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Piracy CD  Pawan Kalyan | Reviews  Stills  

Other Articles