పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే విషయం తాజాగా బయటకొచ్చింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఖచ్చితంగా అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ ఎలాగో చెబుతూ వుంటారు. కానీ బయట ప్రేక్షకులు చూసి, సినిమాకు మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను అందిస్తే ఆ హీరో అభిమానులకు వచ్చే కిక్కే వేరబ్బా. అలాంటి కిక్కే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులకు దక్కింది.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఉగాది పండగ కానుకగా రేపు (ఏప్రిల్ 8)న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఒకరోజు ముందుగానే విడుదలై రచ్చ రచ్చ చేయనుంది. కానీ ఈ సినిమాను ఓ సెన్సార్ బోర్డ్ మెంబర్ చూసి తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
స్పెషల్ స్టోరీ: ప్రపంచ వ్యాప్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి
యుకె దేశంలో ‘ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్’, ‘యుకె సెన్సార్ బోర్డ్ మెంబర్’, ‘ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ మిడిల్ ఈస్ట్ అండ్ యుకె’ అయినటువంటి ఉమైర్ సాంధు తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రానికి ఉమైర్ సాంధు 5/5 రేటింగ్ ఇచ్చారు.
ఇంకా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విశేషాలను తెలియజేస్తూ... పైసా వసూల్ చిత్రమిది. చాలా నచ్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ పైసా వసూల్ మరియు విజిల్స్ వేసే చిత్రమిది. పవన్ కళ్యాణ్ మొత్తం షో అంతా దోచేసాడు. సింప్లీ వన్ మ్యాన్ షో ఇది. అద్భుతమైన నటన కనబరిచాడు. కాజల్ అగర్వాల్ సూపర్ బ్యాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. తను కూడా చాలా చక్కగా నటించింది. పవన్ కళ్యాణ్-కాజల్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. విలన్ పాత్రలో శరద్ కెల్కర్ నటన అద్భుతం. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. అన్ని పాటలు సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ టెర్రిఫిక్. ప్రొడక్షన్ డిజైనింగ్ క్లాసీగా వుంది. సింపుల్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, తక్కువ ఎడిటింగ్, చప్పట్లు కొట్టే విధంగా డైలాగ్స్, ఎముకలు విరిచే విధంగా యాక్షన్ సన్నివేశాలతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అదిరిపోయింది. వెళ్లి తప్పక చూడండి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంటూ తన సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
- Sandy
Exclusive First Review of #SardaarGabbarSingh on my FB Page. Saw & share @PawanKalyan 5*/5* https://t.co/gGT0Dr0gws pic.twitter.com/6EiRcP6bNB
— Umair Sandhu (@sandhumerry) April 6, 2016
Indian Cinema Magazine UAE Review #SardaarGabbarSingh. @PawanKalyan gave Career Best Performance ever. He is One Man Show all the Way. ☆☆☆☆☆
— Umair Sandhu (@sandhumerry) April 6, 2016
Indian Cinema Magazine UAE Review #SardaarGabbarSingh. @SharadK7 & #KajalAggarwal gave TOP Notch Performances. Just WOW to them. ☆☆☆☆☆
— Umair Sandhu (@sandhumerry) April 6, 2016
Indian Cinema Magazine UAE Review #SardaarGabbarSingh.@ThisIsDSP Music is Chartbuster, Paisa Vasool Dialogues, Story & Crispy Editing. ☆☆☆☆☆
— Umair Sandhu (@sandhumerry) April 6, 2016
Indian Cinema Magazine UAE Review #SardaarGabbarSingh. Overall Paisa Vasool & Citii Maar Film. @PawanKalyan Fans will love this flick. ☆☆☆☆☆
— Umair Sandhu (@sandhumerry) April 6, 2016
#SardaarGabbarSingh took BUMPER Opening in Middle East. In Dubai, Morning Shows are HOUSEFULL.
— Umair Sandhu (@sandhumerry) April 7, 2016
(And get your daily news straight to your inbox)
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more