Sardaar Gabbar Singh | Ali Revealed | Pawan kalyan | Tickets Booking

Ali revealed sardaar gabbar singh story

Ali revealed about Sardaar Gabbar Singh, Ali revealed Sardaar Gabbar Singh story, Ali comments Sardaar Gabbar Singh, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Ali revealed Sardaar Gabbar Singh story: Pawan Kalyan Sardaar Gabbar Singh film will be release on 8 April. Kajal Heroine. DSP Music.

ఆలీ షాకింగ్ కామెంట్స్: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ముగ్గురు డైరెక్ట్ చేసారట

Posted: 04/05/2016 01:51 PM IST
Ali revealed sardaar gabbar singh story

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ఈనెల 8న ఉగాది కానుకగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం భాషలలో గ్రాండ్ గా, అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా వున్నారు.

ఇందులో నటుడు అలీ ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సంధర్భంగా అలీ ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. అలీ మాట్లాడుతూ... ఈ సినిమాను తొందరగా స్టార్ చేసి, త్వరగా ఫినిష్ చేద్దామని కాకుండా దర్శకనిర్మాతలు చాలా క్వాలిటీతో పక్కాగా తీర్చిదిద్దారు. ఇందులో గుజరాత్ సెట్ ను హైదరాబాద్ లోనే దాదాపు ఒక 25 ఏకరాల్లో వేసారు. ఆ సెట్ ను అందరు ప్రశంసించారు.


Video Source: Top Telugu Media Click & Subscribe - It's Free

ఇక ఈ సినిమాకు ఇంత చాలా మంది ఆర్టిస్టులు వున్నారని, షూటింగ్ ఆలస్యం అవుతుందనే వుద్దేశ్యంతో... సినిమాలోని ముఖ్యమైన సీన్లను దర్శకుడు బాబీతో చేయించారు. అలాగే ఫైట్ సీన్లను స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ లకు కథ చెప్పేసి వాళ్లతో తీయించారు. ఇక సినిమాలో వచ్చే కొన్ని చిన్న చిన్న సీన్లను ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు పవన్ కళ్యాణ్ స్నేహితుడైన హరీష్ పాయ్ ను అడిషనల్ డైరెక్టర్ గా తీసుకొని చిత్రీకరించారు. ఇక డైలాగుల విషయంలో పబ్లిక్ కు నచ్చేవిధంగా, కొత్తగా, విభిన్నంగా వుండేందుకు ఎక్కువ ఆసక్తి తీసుకోవడం జరిగింది.

ఇక ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పై రూపొందుతుంది. అలాగే ‘గబ్బర్ సింగ్’ చిత్రం తర్వాత వస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. కాబట్టి అన్నివైపుల జాగ్రత్తలు తీసుకొని తీసారు. కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కించారు అని అలీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విశేషాలను తెలియజేసారు.


- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sardaar Gabbar Singh  Ali Revealed  Pawan kalyan  tickets  posters  

Other Articles