Megastar Chiranjeevi | 150film title | Kaththilantodu | Ramcharan

Megastar chiranjeevi as kaththilantodu

Megastar Chiranjeevi 150 film title fixed, Megastar Chiranjeevi as Kaththilantodu, Chiranjeevi title Kaththilantodu, Chiranjeevi 150 film title, Chiranjeevi 150 film updates, Chiranjeevi 150 film news, Chiranjeevi 150 film details, Chiranjeevi

Megastar Chiranjeevi as Kaththilantodu: Megastar Chiranjeevi 150th film latest updates, details, news. VV Vinayak director, Ram Charan Producer, DSP music.

‘కత్తిలాంటోడు’గా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి

Posted: 04/04/2016 12:14 PM IST
Megastar chiranjeevi as kaththilantodu

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. 150వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రాన్ని చిరంజీవి 150వ చిత్రంగా రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి అనౌన్స్ చాలా నెలలే అవుతున్నప్పటికీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్లడం లేదు.

తాజాగా చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ.. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని, పేరుకు తమిళ ‘కత్తి’ రీమేక్ అయినప్పటికీ.. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేసామని, అవి ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా వుంటాయని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో త్వరలోనే అన్ని వివరాలను రాంచరణ్ అధికారికంగా ప్రకటించనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150 film  Kaththilantodu  Ramcharan  stills  

Other Articles