Sardaar Gabbar Singh | Pawan Kalyan | Censor Report | Tamil Release

Sardaar gabbarsingh release in kollywood

Sardaar Gabbar singh Release in Kollywood, Sardaar Gabbar singh Censor report, Sardaar Gabbar singh Trailers, Sardaar Gabbar singh Songs, Sardaar Gabbar singh Posters, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Release in Kollywood: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’

Posted: 04/01/2016 12:21 PM IST
Sardaar gabbarsingh release in kollywood

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎప్పుడెప్పుడూ థియేటర్లలో సందడి చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్త. పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

ముందుగా తెలుగులోనే విడుదలవుతుందని అనుకున్న ఈ చిత్రాన్ని.. హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో విడుదలవ్వనున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళం భాషలో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రముఖ భద్రకాళి ఫిలింస్ సంస్థ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను తాజాగా విడుదల చేసారు.

మొత్తానికి తెలుగుతో పాటు పవర్ స్టార్ ఒకేసారి హిందీ, తమిళం సినీ ఇండస్ట్రీలోకి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే విడుదలైన తెలుగు, హిందీ భాషల ట్రైలర్లు, పాటలు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు రోజుల్లో తమిళ వర్షెన్ కు సంబంధించిన పాటలు, ట్రైలర్లను కూడా విడుదల చేయనున్నారని తెలిసింది.

‘పవర్‘ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Sardaar Gabbar Singh  Censor Report  Tamil release  posters  

Other Articles