Baahubali | National Award Winners | 63rd National Film Awards | Prabhas

Baahubali gets 63 national award

63rd National Film Awards, 63rd National Film Awards winners, Baahubali gets National Award, Baahubali National Award, Baahubali, Amitab bacchan National award, Kangana gets National Award

Baahubali gets 63 National Award: 63rd National Film Awards winners list. Prabhas latest blockbuster hit film baahubali selected as National best film.

నేషనల్ అవార్డ్ కొట్టేసిన ‘బాహుబలి’

Posted: 03/28/2016 12:02 PM IST
Baahubali gets 63 national award

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రం విడుదలై ఏడాది గడుస్తున్నా... ఇప్పటికీ ఇంకా రికార్డుల మోత మోగిస్తూనే వుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో విడుదలై, భారీ కలెక్షన్లను రాబట్టింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులతో పాటు భారీ ప్రశంసలను కూడా అందుకుంది. విజువల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రం తాజాగా జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికయ్యింది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘బాహుబలి’ జాతీయ ఉత్తమసినిమాగా ఎంపికైంది.

‘బాహుబలి’ చిత్రానికి జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికవ్వడంతో తెలుగు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘పికు’ చిత్రంలోని అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా కంగనా రనౌత్, ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ ఎంపికయ్యారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  63 National Awards  Amitab bacchan  Kangana ranauth  

Other Articles