మంచు మోహన్ బాబు క్రమశిక్షణ, పద్ధతుల గురించి అందరికి తెలిసిందే. ఆయన ముక్కుసూటితత్వం, ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం. తప్పుచేసిన వారిని అందరిముందు నిలదీయడం, మంచి చేసినవారిని ప్రశంసించడం ఆయనకున్న అలవాటు. కానీ తాజాగా తానొక్కడే శ్రీరామచంద్రుడని, మిగతావారెవరూ కాదని చెప్పి అందరికి షాక్ ఇచ్చేసాడు. అసలు మోహన్ బాబు అలా అనడానికి గల కారణాలేంటి? ఏ సంధర్భంలో అన్నాడంటే....
మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా సోనారిక, హేభ పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఈడోరకం.. ఆడోరకం’. ప్రముఖ కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎకె. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను నిన్న పలు సినీ ప్రముఖుల ఘనంగా విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర నటీనటులు, సాంకేతికనిపుణులకు మోహన్ బాబు ఆడియో వేదికపై చురకలు అంటించేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వ్యక్తుల తప్పులను గ్రహించిన మోహన్ బాబు... ఆ తప్పులేంటో చూపిస్తూ.. వారికి తనదైన శైలిలో చురకలంటించేసారు.
చిత్ర దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.... గుడ్ డైరెక్టర్ నువ్వు కానీ ఈ వేదికలో రెండు మాటలు స్లిప్ అయ్యావు. ఒకటి.. రైటర్(డైమండ్ రత్నంబాబు) రెండు పెగ్గులు వేస్తే బాగా రాయగలడు అంటూ అన్నావు. ఒక రైటర్ ను సీన్ ఇవ్వగానే బాగా రాయగలడు అంటూ చెప్పాలి. కానీ మందిస్తేనే రాస్తాడు అని చెప్పకూడదు. నాగేశ్వరరెడ్డి గారు సాయంత్రం ఫుల్ బాటిల్ పంపించమన్నారంటూ నాకు చాలాసార్లు చాలా మంది చెప్పారు. మందు తీస్కోవడం తప్పుకాదు. కానీ లిమిటెడ్ లో తీసుకోవాలి. నువ్వు బార్డర్ దాటుతున్నావని చాలా సార్లు చెప్పాను.
రెండవది... ఒక డైరెక్టర్ గా హీరోయిన్(సోనారిక) నీకు హగ్(కౌగిలి) ఇవ్వలేదని అన్నావు. అలాగే డైమండ్ రత్నం కూడా అన్నాడు. కానీ నిజంగా ఆ అమ్మాయి గ్రేట్. మైండ్ లో ఎలాంటి తప్పుడు భావన లేదు. దర్శకుడు ఒక తండ్రిలాంటి వాడు, అలాగే రచయిత ఒక బ్రదర్ లాంటివాడు. కాబట్టి హగ్ అవసరం లేదు అంటూ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, మరియు రచయిత డైమండ్ రత్నంలకు మోహన్ బాబు చురకలంటించేసాడు.
అలాగే తాను తీసుకున్న ఈ చిత్ర రైట్స్ ను తనకు తెలియకుండా దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తీస్తున్నారు. తన బిడ్డతో తీస్తున్నందుకు ఏమి అనలేదు కానీ.. వేరే ఎవరైనా ఇలా చేసుంటే తోలు తీసేవాడిని అంటూ మోహన్ బాబు అదరగొట్టేసాడు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more