యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాతగా నారారోహిత్ -నందిత కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సావిత్రి’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..... ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన రోజు నుండి ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కట్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల శ్రవణ్ అందించిన పాటలు విడుదలయ్యాయి. పాటలకు ఆడియెన్స్ ను మంచి స్పందన వచ్చింది. రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more