Manchu Manoj | Attack | RGV | Surabhi | Hot stills

Attack music launch

Attack Audio Launch, Manchu Manoj Attack Release Date, Attack Latest Trailer, RGV Attack Trailer, Manchu Manoj Attack Movie stills, Manchu Manoj Attack Movie posters, Manchu Manoj Attack Movie News, Manchu Manoj, Attack Movie Trailer

Attack Music Launch: featuring Manchu Manoj, Surabhi, Jagapathi Babu, Prakash Raj, Vadde Naveen, Narsing Yadav among others. Directed by Ram Gopal Varma. Music by Ravi Shankar, D.O.P by Anji and Editing by Anwar Ali. Produced by Swethalana, Varun, Teja and CV Rao under the banner Sree Subha Swetha Films.

మనోజ్ ‘ఎటాక్’ ఆడియో విడుదల

Posted: 03/23/2016 09:19 AM IST
Attack music launch

మంచుమనోజ్, జగపతిబాబు, వడ్డేనవీన్, ప్రకాష్ రాజ్, సురభి ప్రధాన తారాగణంగా సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ సమర్పణలో శ్రీ శుభ శ్వేత ఫిలింస్ పతాకంపై రూపొందిన చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. వరుణ్, తేజ, శ్వేతలాన సి.వి.రావు నిర్మాతలు. రవిశంకర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. బిగ్ సీడీని రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను మంచు మనోజ్ విడుదల చేయగా తొలి సీడీని రాంగోపాల్ వర్మ, సి.కల్యాణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా...

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.... కల్యాణ్ గారు ఈ సినిమాకు ముందు నన్ను కలిసి నా కాలర్ పట్టుకుని నువ్వు చేయాల్సిన సినిమాలివి కావంటూ రెండు గంటలు పాటు క్లాస్ పీకారు. నా నుండి డ్రై డ్రామా, యాక్షన్ మూవీలను ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తారని అన్నారు. ఈ సినిమా విషయానికి వస్తే మనోజ్ కళ్లలో ఓ మాగ్నటిజం ఉంటుంది. అలాంటి ఇన్ టెన్సిటి ఉన్న క్యారెక్టర్ కోసం మనోజ్ తీసుకున్నాను. తను ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. గజల్ శ్రీనివాస్ గారు ఈ చిత్రంలో ఓ పాట పాడారు. అలాగే చిరంజీవిగారి కొట్టండి, తిట్టండి .,..అనే పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో మరోపాటను రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్ లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాట్యిట్యూడ్ తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్ర లేపాను. ధూల్ పేట వంటి ఏరియాలో చిత్రీకరణ చేశాను కాబట్టి గ్లామర్ పార్ట్ కోసం సురభిని హీరోయిన్ గా పెట్టాను. అందరూ బాగా సపోర్ట్ చేశారు అన్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ..... రాంగోపాల్ వర్మగారు ఫిలిం మేకింగ్ లో ఓ యూనివర్సిటీలాంటి వ్యక్తి. అందుకే ఈసినిమాలో వర్క్ చేసిన వాళ్లందరూ ఏదో డబ్బుకోసమని కాకుండా ఆయనతో వర్క్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేసినట్టు కనపడింది. కళ్యాణ్ గారితో చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. ఆయన బ్యానర్ లో సినిమా చేయడం హ్యపీగా ఉంది. ఆయన అడిగితే ఫ్యూచర్ లో కూడా సినిమ చేయడానికి నేను సిద్ధమే. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. అలాగే జగపతిబాబుగారు, ప్రకాష్ రాజ్ గారు, వడ్డే నవీన్ వంటి యాక్టర్స్ తో కలిసి యాక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే రవిశంకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగా, అంజి తన సినిమాటోగ్రపీతో సీన్ హైలైట్ గా చూపించాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.

అభిమన్యుసింగ్, మంజు భార్గవి, చలపతిరావు, నర్సింగ్ యాదవ్, లక్ష్మయ్య చౌదరి తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, లైన్ ప్రొడ్యూసర్: ప్రసాద్ గుమ్ములూరి, ఎడిటర్: అన్వర్ అలీ, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, మార్షల్ రమణ, ఆర్ట్: టి.నాగేంద్ర ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మ్యూజిక్: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: అంజి, కో ప్రొడ్యూసర్: మలినేని లక్ష్మయ్య చౌదరి, నిర్మాతలు: వరుణ్, తేజ, శ్వేతలాన, సి.వి.రావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంగోపాల్ వర్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Attack  Audio Launch  Release date  Trailer  Surabhi  Jagapathi Babu  Prakash Raj  

Other Articles