Premante Suluvu Kadura | Censor Report | Rajeev Saloori | stills

Premante suluvukadura censor report

Premante Suluvu Kadura Censor Completed, Premante Suluvu Kadura movie stills, Premante Suluvu Kadura movie posters, Premante Suluvu Kadura movie latest updates, Premante Suluvu Kadura movie censor report

Premante Suluvukadura Censor Report: Rajeev Saloori latest film Premante Suluvu Kadura. movie ready to release.

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘ప్రేమంటే సులువు కాదురా’

Posted: 03/23/2016 09:35 AM IST
Premante suluvukadura censor report

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సిమ్మీదాస్ హీరోయిన్. చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.ప్రొడక్షన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. కృష్ణ మాదినేని సాహిత్యం సమకూర్చగా.. నందన్‌రాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా గీతాలు ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ ‘మధుర ఆడియో’ ద్వారా విడుదలై విశేష ఆదరణ పొందుతున్నాయి. "ప్రాణం" కమలాకర్ ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ చేయడం గమనార్హం. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి "క్లీన్ యు" సర్టిఫికేట్ తో పాటు .. సెన్సార్ సభ్యుల ప్రశంసలు సైతం లభించడం విశేషం.

ఈ సందర్భంగా దర్శకుడు చందా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.... కథ-కథనాలు, సంభాషణలు, పాటలు, నేపధ్య సంగీతం, హీరోహీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ "ప్రేమంటే సులువు కాదురా" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ పూర్తయ్యింది. "క్లీన్ యు" సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు.. ఇటీవలకాలంలో తాము చూసిన మంచి చిత్రాల్లో ఒకటిగా సెన్సార్ మెంబర్స్ మెచ్చుకోవడం.. "ప్రేమంటే సులువు కాదురా" సాధించబోయే విజయంపై మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. "ప్రాణం" కమలాకర్ అందించిన నేపధ్య సంగీతం, ఉద్ధవ్ ఎడిటింగ్ సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు మా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అన్నారు.

కాశీ విశ్వనాద్, మధుమణి, చమక్ చంద్ర, చలాకి చంటి, వైజాగ్ అప్పారావు, టార్జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి చాయాగ్రహణం: సురేష్ రఘుట, కూర్పు: యస్.బి.ఉద్ధవ్, పాటలు: కృష్ణ మాదినేని, సంగీతం: నందన్ రాజ్, నేపధ్య సంగీతం: "ప్రాణం" కమలాకర్, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: చందా గోవింద్ రెడ్డి!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Premante Suluvu Kadura  Censor report  Stills  posters  

Other Articles